పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తకు లోబడి యే మండ నిచ్చును గాని పైకి ఉముకలోని కెగఁ బ్రాకనియ్యడు. అదినలువైపుల నుముకలోనికి వ్యాపింపజోచ్చినప్పుడు చుట్టును నీరు వోసి చల్లార్చును. ఆదినుండి నా స్థితి యించు మించుగా నట్లే సాగినది. బ్రదుకు సాగిం చుకొనుటకు వాజ్మయసేవ సాధనముగా నా కేర్పడినది గాన, అందులో అరకుడుపు సాగునట్లు పని చేయుటకే నా యంతర్యామి నన్ను మెసల నిచ్చినది గాని యంత కెక్కువగా సాధించుటకు గాని నాకు చోటియ్యకే పోయెను.


--- ---