పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరభద్రరావుగారు నాఁ డట్లు పశ్చాత్తాపము వెల్లడించిరే కాని కొన్నేళ్ళ తర్వాత మరల నాయెడ వికటము గానే వర్తిల్ల సాగిరి. శ్రీ నాధుని గూర్చి, ఇంకే వేవో విషయముల గూర్చి సత్యదూరము లయినవే కాక దూర్తములు నయిన రచనముల నాయెడ జరపిరి. వాని కెన్నఁ డు గాని వారికి నేను బదులు వ్రాయఁ దలఁ పలేదు. శ్రీవీరేశలింగముపంతులుగారు పరమపూజ్యులు, మహనీయులు నయ్యు నహమిక, మమకారము నధికముగాఁ గలవా రని తర్వాత తలఁపనయ్యెను.

నిరుపమాన మహామహిమోపేతులు పురుషోత్తములు గంధిగారు పెర్వెలసినపిదప మానవమర్యాదయే యసాదారణ యోగ్యత నందుకొనఁ గల్గెను. వారి శీలజ్యోతిముం దంతకు ముందు పెర్వెలసిన పెద్దల ప్రకాస్తు లెన్నో వెలవెల లాడ వలసిన వయ్యేను.

శ్రీ లక్ష్మణరావుగారు వీరేశలింగము పంతులుగారి నొక నాఁడు ప్రాచ్యలిఖిత పుస్తక శాలకు గొనివచ్చి - వారప్పుడు కవుల చరిత్రను సంస్కరించి ప్రకటింపఁ బూనియున్నారు గాన- వారి కస్మదాదుల సహాయము లభింపఁ జేయుటకై జతనము సాగించుటలో న న్నెఱుక పఱచిరి. పావులూరి మల్లన చరిత్ర విషయములు వీరేశలింగము గారి దగ్గఱ, నా దగ్గఱ చర్చించి తత్త్వము నిర్ణయింప నభిలషించిరి. అన్ని వ్రాఁత ప్రతులను జూపినా వాద మెఱిఁగించితిని. వీరేశలింగము గారికి వేఱువిధముగా, పూర్వ ముతాము వ్రాసిన తీరుగా సమర్ధింపనయితిగాదయ్యెను. లక్ష్మణరావుగారు జాగ్రత్తగా నెల్ల విషయము