పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాచ్యలిఖిత పుస్తశాలకు పదే పదే సందు దొరకినప్పు డెల్ల వెళ్ళుచు అక్కడి గ్రంధములు, అముద్రితములు పరిశీలించుచు, లోకల్ రికార్డు నెల్ల చదువుచు, అపూర్వాంశముల గుర్తించుచు, గుర్తించిన వానిని మిత్రుల కుత్తరముల ద్వారా తెలుపుచు తన్మయుఁ డనై విద్యావ్యా సంగము చేయుచుంటిని. ప్రాచ్యలిఖిత పుస్తక శాలాధ్యక్షు లొకతూరి లైబ్రేరియ౯ ద్వారా నా విషయములు తెలిసికొనిరి. తెలుఁ గుపుస్తకములకు కేటలాగు వ్రాయుచున్న గుమస్తా శెలవు పెట్టగాతోడ్తో నా స్తానమున నన్నున్నియోగించిరి. అది టెంపరరీ పోస్టు. అందుచే ఆ గుమాస్తా తొలఁ గెను. అతని పై ఆఫీసు వారి కతృప్తి. ఆతడు తొలఁ గినపిదప ఆ పోస్టును స్థిరముగావించి యందు నన్ను నియోగించిరి.

ఆనాళ్ళలో పావులూరు మల్లనకవిని గూర్చి నా మూలమున చర్చ రేగెను. శ్రీ వీరేశలింగముపంతులుగారు కవుల చరిత్రలో వ్రాసిన తీరు సరిగాదని, పావులూరి మల్లన నన్నయ నాఁటి మల్లన మనుమఁ డని నేను లైబ్రరీలోని వ్రాఁ తపుస్తకములఁ బరిశీలించి పత్రికల ద్వారా నిరూపింప యత్నించితిని. అప్పటి మద్రాసు తెలుఁ గు పత్రిక శశి లేఖ వీరేశలింగముపంతులుగారి తరపున నిలిచి అనేకులు నా పై చెలరేగిరి. వీరావేశముతో చిలుకూరి వీరభద్ర రావుగారు లైబ్రరీ పుస్తకములను నేను పసికుంకను జేరి దుర్బుద్ధితో మార్చివేయుచుంటినని, నేను వ్రాసినట్లు వ్రాఁ త ప్రత్రులలో లేదని, గవర్న మెంటువారు నన్నక్కడ నుంచరా దని బాహాటముగా వ్యాసములు