పుట:Prabodhanandam Natikalu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎందుకో తెలుసా నీ అడ్రస్‌ నీకే తెలియదు, నేను పలానా చోట ఉన్నానని చెప్పలేవు. నీ అడ్రస్సే నీకు తెలియనపుడు, దేవుని అడ్రస్సు నీకు ఏమాత్రము తెలియదు. కావున ఆయన ఎక్కడున్నాడని పిలువగలవు? నీ అడ్రస్‌గానీ, దేవుని అడ్రస్‌గానీ తెలియకుండ బ్రతికే నీవు నేను ఫలానా మతమువాడిని, నా దేవుడు ఫలానావాడని చెప్పగలవా? ఒకవేళ నీవు చెప్పినా మేము నమ్మాలా? నీవు వహీద్‌ అనినా, నీది ఇస్లామ్‌ అనినా, నా దేవుడు అల్లా అనినా నేను నమ్మను. నీవు వహీద్‌వే కానప్పుడు, నీ దేవుడు అల్లా అని నేను ఎందుకు నమ్మాలి? చెప్పు గుప్త నీవు దేవుని చూచావా? లేక దేవుని అడ్రస్‌ ఏమైనా నీకు తెలుసా?

గుప్త :- నేను ఇంతవరకు దేవుణ్ణి చూడలేదు. ఆయన ఎక్కడుండేది తెలియదు.

దొంగ  :- నీవేకాదు, జాన్‌కానీ, వహీద్‌కానీ చూడలేదు. దేవుడు ఎట్లుంటాడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, ఏమి చేస్తుంటాడో కూడ తెలియదు. దేవుని విషయము ఏమాత్రము తెలియనపుడు దేవునికి ఒక పేరుపెట్టి, మా దేవుడు ఫలానావాడని చెప్పడము అబద్దము కాదా?

ముస్లీమ్‌  :- మా మతములో మా ప్రవక్త చెప్పినట్లు నడుచుకొంటున్నాము. ప్రవక్త చెప్పినట్లు నడుచుకొంటే దేవునివద్దకు పోగలమని మాకు నమ్మకమున్నది.

దొంగ  :- మీ ప్రవక్త చెప్పినట్లు నడుచుకొంటే ఫరవాలేదు. మీ ప్రవక్త చాలా గొప్ప దైవజ్ఞాని, ఆయన చెప్పినట్లు నడుచుకొంటే దేవునివద్దకు పోవచ్చును. ప్రవక్త చెప్పిన విధానమును అర్థము చేసుకోలేనివారు, ప్రవక్త చెప్పినట్లు చేయుచున్నామని అనుచుందురు. కానీ ప్రవక్త చెప్పిన ప్రకారము వారు నడువలేదని వారికి తెలియదు. ప్రవక్త చాలా సూక్ష్మ విషయములను