పుట:Prabodhanandam Natikalu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధర్మములు ఒక్కటి కూడ తెలియవు. హిందూమతములో దేవుని జ్ఞానము లేదు, దేవతాభక్తి కలదు. అందువలన జ్ఞానజిజ్ఞాసులందరు ఇతర మతము లోనికి పోవుచున్నారు.

ముస్లీమ్‌  :- నేను కూడ మొదట హిందువునే. హిందుత్వమును అడ్డము పెట్టుకొని వినాయకచవితి పండుగలో దౌర్జన్యముగ డబ్బులు వసూలు చేయువారిని చూచి, అటువంటి అన్యాయానికి మద్దతు ఇచ్చే హిందూ సంస్థలను చూచి, ఆ పద్ధతులు నచ్చక ఏకేశ్వరోపాసన గల ఇస్లామ్‌ మతములోనికి వచ్చి నాపేరును కూడ మార్చుకొన్నాను.

హిందువు  :- నిజమే వినాయకచవితి అల్లరి పండగైపోయింది. ఆ పండుగలో చందాలు వసూలు చేయువారు వీధిరౌడీలలాగ ప్రవర్తిస్తున్నారు. హిందూమతము గొప్పదే, కానీ ఇటువంటి వారివలన అప్రతిష్ఠపాలై పోవుచున్నది.

క్రైస్తవుడు  :- మీ మతములో భగవద్గీతను గొప్పగ బోధించు ఒక పెద్ద గురువు మీదనే విశ్వహిందూపరిషత్‌వారు, భజరంగ్‌దళ్‌వారు వేదాలను చెప్పకుండ భగవద్గీతను చెప్పుతావా, వేదాలకంటే భగవద్గీత ముందు పుట్టినదంటావా అని దాడిచేసిన రోజే హిందూమతము ప్రతిష్ఠ మంటలో కలిసిపోయింది. ఆ సంఘటనను చూచిన తర్వాతే హిందూమతములో ఒక గురువునే అవమానపరచు హిందూసంఘములుండుటను చూచి క్రైస్తవ మతములో ఫాదర్‌కు , పాస్టర్‌కు ఎంతో మర్యాదకలదని క్రైస్తవులు వారి గురువులపట్ల వినయ విధేయతలుకల్గి గౌరవభావముతో ఉండుటను చూచి నేను క్రైస్తవునిగా మారిపోయాను.

(అంతలో ఆరుమంది దొంగలు వచ్చి, ఆ ముగ్గురిని కొట్టి వారి వద్ద ఉన్నవన్ని గుంజుకొని అంతటితో ఆగక వారి తలవెంట్రుకలను, గడ్డము