పుట:Prabodhanandam Natikalu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తన భక్తులకు కనిపించి తర్వాత ఎటో తెలియకుండ పోయాడు. శిలువ మీద ప్రభువు చనిపోలేదు, చనిపోయినట్లు నటించాడు, తర్వాత పారి పోయాడు. అటువంటివాడు దేవుడెలా అవుతాడు. మా అల్లా ఎవరికి కనిపించలేదు, ఏ మనిషి చేతికి దొరకలేదు. కావున మా అల్లానే నిజమైన దేవుడు.

హిందువు  :- కనిపించనివాడు దేవుడెలా అవుతాడు? మా రాముడు కనిపించాడు, వాళ్ళ ప్రభువు కనిపించాడు. మీ అల్లా ఎక్కడా కనిపించలేదే!

ముస్లీమ్‌  :- సర్వలోక సృష్ఠికర్త అయినవాడు మా దేవుడు. మీ దేవునికి రూపమున్నట్లు మా దేవునికి రూపము, పేరు ఉండవు.

క్రైస్తవుడు :- మీ దేవునికి రూపము, పేరు లేదు అంటున్నావు. అలాగైతే అల్లా అని పేరుపెట్టి ఎవరిని పిలుస్తున్నావు? అంతే కాకుండ మీ హదీసు పండితులు దేవునికి 100 పేర్లున్నాయని చెప్పుచున్నారు. ఇంకా మీ దేవునికి పెద్ద సింహాసనము ఉందని, దేవుడు పై లోకములో ఉన్నాడని, ప్రళయములో అందరిని సమాధులలో నుండి లేపునని, అప్పుడు పాపము చేసిన వానిని నరకమునకు, పుణ్యము చేసిన వానిని స్వర్గమునకు పంపునని చెప్పుచున్నారు కదా! అలాంటపుడు మీ దేవుడైన అల్లాకు రూపము, పేరు, పని ఉన్నట్లే కదా!

హిందువు  :- ఇప్పుడేమంటావు చెప్పు.

ముస్లీమ్‌  :- ఇప్పుడు కూడ మా దేవుడైన అల్లానే గొప్ప అంటాను. మా దేవుని మీద మాకు విశ్వాసమున్నట్లు మీ దేవుళ్ళమీద మీకు విశ్వాసము ఉందా? ముస్లీమ్‌ అంటేనే విశ్వాసి అని అర్థము. మా దేవునికంటే గొప్పవాడు లేడు, మా ఇస్లామ్‌లోవున్న విశ్వాసము ఏ మతములోనూ లేదు. అవునా, కాదా?