పుట:Prabodhanandam Natikalu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిందువు  :- అయితే రాముణ్ణి దేవుడు కాదంటావా?

ముస్లీమ్‌ :- నేను రాముణ్ణి దేవుడు కాదు అనడములేదు. నీ అలవాటు ప్రకారము నీకు రాముడు దేవుడే, నా అలవాటు ప్రకారము నాకు అల్లా దేవుడే అంటున్నాను.

క్రైస్తవుడు :- స్వచ్ఛమైన దేవుడెవరో తెలుసుకోమంటున్నాను. మాకు స్వచ్ఛమైన దేవుడు ప్రభువే.

హిందువు  :- మీకు ప్రభువు స్వచ్ఛమైన దేవుడైతే, శిలువ మీద ములుకులు కొట్టించుకొని రక్తము కార్చి ఎందుకు చనిపోయాడు?

క్రైస్తవుడు  :- పాపులను తన రక్తముతో కడిగే దానికి ఆయన రక్తమును కార్చాడు. ఆయన దేవుడైన దానివలననే అలాగ చేశాడు. చనిపోయి లేచిన వాడే నిజమైన దేవుడు. ఆయనే ప్రభువు.

హిందువు  :- ఆ రోజు ఆయన రక్తముతో ఎవరూ తమ పాపములను కడుగుకోలేదే? ప్రభువును శిలువవేసిన వారు పాపము చేసినట్లే కదా! ప్రభువును చంపించిన యూదా పాపియే కదా! ప్రభువు శిలువ వేయబడిన దినము దగ్గరలోనున్నవారే కడుక్కోలేదు. మిగతావారు ఎవరు కడుక్కొన్నారు, ఎవరి పాపము పోయింది చెప్పగలవా?

ముస్లీమ్‌ :- ఏసుప్రభువు శిలువ మీద చనిపోలేదు. చనిపోయినట్లు నటించాడు. అతను చనిపోయివుంటే అక్కడే కాపలావున్న సైనికుడు ప్రభువు డొక్కలో పొడిచినపుడు రక్తము కారదు కదా! కానీ రక్తము కారింది. చనిపోయిన వానికి రక్తము గడ్డకట్టి పోతుంది. చనిపోయినట్లు నటిస్తున్న ప్రభువును సైనికులు పొరపాటుగా చనిపోయాడనుకొన్నారు. తర్వాత మూడవరోజు సమాధిలోనుండి లేచి పారిపోయాడు. 40 రోజులు బయట