పుట:Prabodhanandam Natikalu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దివ్య జ్ఞానసందేశమును అందించబోవుచున్నారు. మేమును అచటికే పోవుచున్నాము. మీరును మాతో రావచ్చును.

భక్తులు :- ధన్యులము స్వామీ! ఇంతకాలమునకు విలువైన జ్ఞానమార్గము లభించినందుకు ఎంతో ఆనందముగా ఉన్నది. నేటినుండి యోగీశ్వరుల జ్ఞానమును తెలుసుకొని, శైవము, వైష్ణవమనెడి మతములకతీతమైన జ్ఞానమును ప్రపంచమంతా ప్రచారము చేయుదుమని ప్రతిజ్ఞ చేయుచున్నాము.

బ్రహ్మ :- ఇంతటి గొప్ప జ్ఞానమును అందించిన ఆచార్య ప్రబోధానందులకు నమస్కరించుచూ

ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులకు జై...

-***-


ఎవడు జ్ఞాని - ఏది మతము

(తెర తీయగానే మొదటి దృశ్యములో)

ఒక హిందువు, ఒక క్రైస్తవుడు, ఒక ముస్లీమ్‌ ముగ్గురు కలిసి ప్రయాణము చేయుచుందురు. హిందువు గడ్డము పొడవుగా పెంచి తల వెంట్రుకలు ముడివేసి, పెద్ద నామము కలిగివుండును. క్రైస్తవుడు తెల్లని పొడవు అంగీ తొడిగి, అంగీమీద శిలువ డాలర్‌ను కనిపించునట్లు పెట్టు కొన్నాడు. ముస్లీమ్‌ మోకాళ్ళ క్రిందికి జిబ్బా వేసుకొని, మడమలపైకి పైజమా ధరించియున్నాడు. వారిని చూస్తూనే పలానావాడు, పలాన మతమునకు చెందినవాడని తెలియుచున్నది. వారి ముగ్గురికీ జలుబు చేసివుండడము వలన, వారు అప్పుడప్పుడు తుమ్ముచుండెడివారు. హిందువు తుమ్మినపుడు "రామ" అనుచుండెను. క్రైస్తవుడు తుమ్మినపుడు "ప్రభు" అనుచుండెను. అలాగే ముస్లీమ్‌ తుమ్మినపుడు "అల్లా" అనెడివాడు. వారు