పుట:Prabodhanandam Natikalu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రహ్మ:- దైవజ్ఞానము తెలిసినవారి మధ్య శరీరసంబంధముకన్నా, గొప్పదైన ఆత్మ సంబంధముండును. మా ముగ్గురికీ మధ్య అటువంటి ఆత్మసంబంధమే ఉండి మేము కలిసికట్టుగా ఉంటూ, దైవజ్ఞానమును పెంపొందించుకొంటూ దైవాన్ని చేరవలెననే తపనలో ఉన్నాము. కానీ మీరు మా పేర్లు చెప్పుకొని కలహించుకొనుచున్నారు. మాకులేని విభేదాలు మీకేల?

నేను కూడా ఒకపుడు మీవంటి సాధారణ మానవుడినే! కానీ నిజమైన దైవజ్ఞానమును తెలుసుకొని, ఆచరించి ఇదిగో! ఈ రోజు ఈ బ్రహ్మస్థానమునొంది, దేవతలైన విష్ణు, ఈశ్వరుల సరసన నిలిచితిని. నిజమైన దైవమును చేరి, మోక్షమునొందవలెనని మేమెంత తపించుచుంటిమో. మీరు అట్లే తపించండి. అందుకు అవసరమైన సంపూర్ణ దైవజ్ఞానమును తెలియండి. ఈ కలహాలుమానండి.

భక్తులు :- స్వామీ! అటువంటి విలువైన జ్ఞానము ఈ మాయ ప్రపంచములో ఎక్కడ లభించును.

బ్రహ్మ :- సంతోషం నాయనాలారా! మీరడిగిన ప్రశ్నను బట్టి, మీకు జ్ఞానోదయమైనదని తెలియుచున్నది. ఇక మీ ప్రశ్నకు జవాబు ఏమనగా! మేము చెప్పినది, ఆచరించినది అయిన దైవజ్ఞానము, ఈరోజు అదృష్టవశాత్తు ఈ భూమిపైనే లభించును.

భక్తులు :- ఎక్కడ స్వామీ! త్వరగా సెలవీయండి!

బ్రహ్మ :- చిన్నపొడమల గ్రామములో ప్రబోధాశ్రమములో శ్రీకృష్ణుని నిజమైన బోధ అయిన త్రైతసిద్ధాంత భగవద్గీత జ్ఞానసందేశమును ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లవారు నిర్విరామముగా అందించుచున్నారు. అన్నట్లు మరొక విషయము. ఈ రోజు శ్రీకృష్ణాష్టమి సందర్భముగా యోగీశ్వరులవారి