పుట:Prabodhanandam Natikalu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మతములలో మునిగి, ఇహములోనే ఉండిపోవుచున్నారు. మీరు ఎంతటి అజ్ఞానాంధకారములో ఉన్నారంటే, ఈ సకలసృష్ఠినీ బ్రహ్మ అను పేరుగల నేను తయారు చేశానను మూఢనమ్మకముతో ఉన్నారు.

వాస్తవమునకు ఈ సర్వసృష్ఠిని తయారు చేసినవాడే దేవుడు. సృష్ఠికర్త! పరమాత్మ, అధిపతి, ఆదికర్త అను పదములన్నియు దైవమునకు పర్యాయ పదములే! దేవుడు సృష్ఠించిన సకల జీవరాసిలో ఒకటైన మానవ జాతి రెండు రకములుగా విభజించబడినది. అవియే దేవజాతి, రాక్షసజాతి. జ్ఞానమున్నవారు ఈ రెండిటినీ గుర్తించవచ్చును. మరియు తాను ఏ జాతివాడైనదీ గుర్తించవచ్చును.

భగవద్గీతయందు "దైవాసుర సంప ద్విభాగ యోగము" అను అధ్యాయములో భగవంతుడు, దేవతల, రాక్షసుల యొక్క గుణములను చెప్పియున్నాడు. దాని ఆధారముగా దైవజ్ఞానము తెలిసినవారు దేవతలనీ, అజ్ఞానము కల్గినవారు రాక్షసులనీ చెప్పవచ్చును. అంతేకాక తెలుసుకొన్న జ్ఞానము పరిమాణమును బట్టి దేవతలకు కొన్ని హోదాలు ఈయబడినవి. అవియే విష్ణు, ఈశ్వర, బ్రహ్మస్థానములు లేదా పదవుల హోదాలు. అత్యధిక జ్ఞానశక్తి కలవానిని విష్ణువు అనీ, అక్కడినుండి జ్ఞానశక్తి తగ్గుకొలది ఈశ్వర, బ్రహ్మ మొదలగు దిక్పాలురు వరకు కలరు.

మానవులలోనే దేవతలు ఉన్నప్పటికీ, వారిని భూమిమీద ఎందుకు గుర్తించలేక పోవుచున్నారనే ప్రశ్న మీకు వచ్చును. దానికి సమాధానముగా గీతలో భగవంతుడు చెప్పినట్లు, దేవతలు అందరూ భూమిపైనే ఉన్నారు. కానీ అజ్ఞానులు వారిని గుర్తించలేరు. ఎందుచేతననగా మనకున్న స్థూల కన్నులతో చూచిన, అన్నీ మానవాకారములే కన్పించును. మానవుల యందున్న దైవత్వమును గుర్తించవలెనన్న జ్ఞానదృష్ఠి కావలెను. ఈ జ్ఞానదృష్ఠి