పుట:Prabodhanandam Natikalu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అడ్డనామం :- స్వామీ! మీరు కూడ అలా కోపగించుకొని పొమ్మంటే ఎట్లా తండ్రీ. మాకు ఊహ తెలిసినప్పటినుండి మిమ్ములను నిజమైన దేవుళ్ళగా భావిస్తున్నాము, ఒక్కసారిగా మమ్ములను చీదరించుకోకుండ, అసలు విషయాలు తెలియజేయండి, నిజమైన దైవాన్ని తెలియజేయండి.

విష్ణు :- చూడండి నాయనాలార! మేము దేవతలము మాత్రమే, మీకు మాకు సృష్ఠికంతటికి అధిపతి ఒకే పరమాత్మనే. అందరమూ ఆయన బిడ్డలము కాబట్టి మీరు కూడ ఆయన జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరిస్తే మీరు కూడ యోగులుగా తయారవుతారు. యోగులు దేవతలకంటే అధికులు. పూర్వము దుర్వాసుడు అనే యోగి నన్ను కోపంతో కాలితో తన్నితే, ఆయన ముందు నాశక్తి చాలక ఏమీ చేయలేక పోయాను. అంటే మనుష్యులు కూడ జ్ఞానమును తెలిసి ఆచరిస్తే యోగులుగా అయి దైవత్త్వాన్ని పొందుతారు.

నిలువునామం :- అటువంటి నిజమైన జ్ఞాన వివరము తెలియాలంటే ఏమి చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? స్వామీ కొంచెం మాకు తెలియజేయండి.

శంకురుడు :- మేము చెప్పితే స్వార్థముతో చెప్పాడనుకుంటారు. బ్రహ్మగారికి భూలోకములో గుడిలేదు భక్తులు లేరు కావున ఆయననే అడగండి, నిస్వార్థముగా చెబుతాడు.

అడ్డనామం :- స్వామి బ్రహ్మగారు, మీరు అనుసరిస్తున్న జ్ఞాన విషయాలను గూర్చి చెప్పి మేము నిజమైన మార్గాన్ని తెలుసుకునేటట్లు జేయండి తండ్రి.

బ్రహ్మ :- నాయనలారా! మీ అజ్ఞానమునకు ఒకవైపు జాలి, ఒకవైపు కోపము కలుగుచున్నవి. అజ్ఞానమే అన్ని అనర్థములకు కారణమని మిమ్ములను చూచి తెలియుచున్నది. దేవునికీ, దేవతలకు తేడా తెలియక, ఎవరు దేవుడో, ఎవరు దేవతలో తెలియని అయోమయములోపడి, మీరు సృష్ఠించుకొన్న