పుట:Prabodhanandam Natikalu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆలయం దేహమే. పుణ్యక్షేత్రాలు అన్న పదాన్ని కట్టడాలకు, స్థలాలకు వాడకూడదు. ఇంకా ఏమి అన్నావు? హూండీలో డబ్బులు వేసావా? అవి ఏనాడైన నేను ఒక్క రూపాయైన ఖర్చుపెట్టానా? అవి నాదాక వచ్చినవా? నాకు 100/- హూండీలో వేసి లక్షరూపాయలు కోరుతున్నారు.

ఇంకా ఏమి చెప్పావు. నీవు, నీ కుటుంబ సభ్యులందరు మీ తల వెంట్రుకలను సమర్పించినారా? నెత్తిమీద సరుకే కదా మొత్తానికి చవకేకదా అని చెప్పినట్లు ఊరక పెరిగిన వెంట్రుకలను మాకు ముడుపులుగా ఇస్తున్నారు. మేము ఏమయినా సవరాల వ్యాపారం చేస్తున్నామా, అసలు తలనీలాలు ఎందుకు సమర్పిస్తారో తెలుసా మీకు?

శంకరుడు :- వాళ్ళకి అటువంటి జ్ఞానవిషయాల మీద ఆసక్తి ఎందు కుంటుంది? కేవలం కోర్కెలమీదనే ధ్యాసంతా ఉంటుంది. మొన్నటికిమొన్న నా ఆలయానికి వచ్చినవారు కొందరిలో ఒకడు మా బావమారిదిని నీవు చంపేస్తే మా అత్తగారి ఆస్తి మొత్తం నాకు వస్తుంది. అట్లు చేస్తే నా తలవెంట్రుకలు ఇస్తానంటాడు. ఇంకొక విద్యార్థి పరీక్షలు సమీపించినా చదవడు. ఆటలు, పాటలు, అమ్మాయిలతో షికారులు చేసినవాడికి ఆ పరీక్షలన్నిటిలో నేను ఉత్తీర్ణుడును చేస్తే, నా గుడికివచ్చి గుండు గీయిస్తానంటాడు. ఇంకొకడు ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే వాళ్ల పై అధికారులనంతా శాసించే పెద్ద హోదా కల్పిస్తే, తలనీలాలు అర్పిస్తా నంటాడు. ఇంకొక రాజకీయ నాయకుడు గెలిచిన మొదటిసారే పెద్ద మంత్రి కావాలంటాడు. వీళ్ళందరి కోర్కెలు తీర్చితే, నాకు వాళ్ళ తల వెంట్రుకలు ఇస్తారంట. ఇలా ఎందుకు తయరైనాము, అసలు జ్ఞానం అంటే ఏమిటి? జీవుడు ఎవరు? దేవుడు ఎవడు? అని ఎప్పుడైన ఆలోచించారా? మీరు పోయి ముందు జ్ఞానం తెలుసుకోండి.