పుట:Prabodhanandam Natikalu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిలువునామం :- ఆ! ఏందయ్యా అడ్డనామం ఏందీ నీ కథ, మమ్ములను దబాయించి, నెగ్గుకొస్తున్నట్లు చేస్తున్నావు. ఇది మన ఊరు కాదు. నా నారాయణుడు నివశిస్తున్న ప్రాంతము. ఆయనకు కోపం వస్తే సుదర్శన చక్రముతో నీ తలను ఖండిస్తాడు. నా నారాయణుడంటే అసలైన దేవదేవుడు. అందుకే వైకుంఠనివాసుడుగా పేరొందాడు. మరి నీ శివుడు స్మశానవాసి ఆ సంగతి కూడ నీకు తెలుసో తెలియదో.

శంకరుడు :- చూడండి నాయనలార, సృష్ఠి ఆదినుండి కలహాలు లేని మాకు మీరే కలహాలు పెట్టేవారవుతావున్నారు. మీరు అనుకున్నట్లు నేను దేవుడినికాదు, దేవతను మాత్రమే. నేను కూడ పరమాత్మ చిహ్నమైన ఈశ్వరలింగాన్ని మాత్రమే ఆరాధిస్తున్నాను. అదియే సృష్ఠికర్త అయిన దేవునికి కనిపించే గుర్తు కాబట్టి సృష్ఠి ఆదినుండి అన్యచింతన లేకుండ ఈశ్వర లింగాన్ని ఆరాధిస్తున్నాను. కాబట్టి మాములు శివుడునైన నాకు దేవత హోదా కల్గింది. అంతేకానీ నేను సృష్ఠికర్తను కాదు. అందుకే నేను కూడ ముక్తి కోసమే బ్రహ్మయోగం చేస్తున్నాను.

అడ్డనామం :- ఏంటీ! నీవు ఈశ్వరలింగాన్ని పూజిస్తున్నావా! అంటే నీవు వేరు, ఈశ్వరలింగము వేరా? నీవే సృష్ఠికర్త అని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాను, ఎన్నో మౌనవ్రతాలు చేశాను, ఎంతో ధనము, కాలాన్ని వృథా చేశాను. కళ్ళుమూసుకొని ఎన్నో రోజులు నీకోసం తపస్సు చేశాను. మరి నీవు సగం కళ్ళు తెరచి యోగము చేస్తున్నావు, నీవు ఏమి యోగము చేస్తున్నావో నాకు కొంచెం కూడ తెలియడం లేదు శంకరా...

శంకరుడు :- అవును నాయన నేను కూడ ఎన్నో యుగాలుగా కళ్ళు మూసుకొని యోగం చేశాను. కానీ కలియుగం వచ్చినాక సగంకళ్ళు తెరుచుకొని చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అంతా దొంగలే, మోసగాళ్ళే! దేవతలను గొప్పగా చెప్పుకుంటూ, పూజిస్తూ కూడ మా సొమ్మునే