--పాట--
ప॥ | పో పోర పొమ్మికన్ నీ ముఖం చూపించరావలదు రాతగదు పో పోర పొమ్మికన్ | |
కనకం :- ఏమండీ వాన్ని కొట్టకండి, నేను నచ్చ జెప్పుతాను. (వేణుతో) ఏమిరా వేణూ? మీ నాయనకు కోపం వచ్చే పనులను ఎందుకు చేస్తావురా నాయనా!
--పద్యం--
తే॥గీ॥ | ముసలి ముతకలు కోరెడి ముక్తి విద్య | |
వేణు :- అమ్మా! ఆశ్రమానికిపోయి జ్ఞానం తెలుసుకున్నంత మాత్రానే, పెండ్లీ పెటాకులు లేకుండ, సన్న్యాసినై సత్రాలు, చావిళ్ళు చేరతాననుకున్నారా అదేం లేదు. మా గురువుగారు మాకు బోధించేదంతా రాజయోగ సిద్ధాంతం.
కాటమయ్య :- నీ పిండాకూడు సిద్ధాంతంరా, ఇరుగు పొరుగువాళ్ళను