పుట:Prabodhanandam Natikalu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేణు :- ఔనన్నయా! తాతయ్యగార్ని పురాణాల ప్రభావమునుండి తప్పించి ధర్మాశాస్త్రాలవైపు త్రిప్పగలిగినందుకు సంతోషిస్తున్నాను.

చంద్రం :- వాట్‌! ధర్మశాస్త్రమా! అది ఎందుకు ఉపయోగపడుతుంది మానవులకు?

వేణు :- ఎందుకేమిటన్నయ్యా! దేవున్ని తెలుసుకొనేటందుకు, ఆయనలో ఐక్యమయేటందుకు.

చంద్రం :- నాన్‌సెన్స్‌ దేవుడు దేవుడు దేవుడు, ఎక్కడున్నాడు దేవుడు. మానవ మేధస్సు మహోన్నతంగా పెరిగి పోయిందిరా బ్రదర్‌, ఆకాశంలో రయ్‌మని వేగంగా దూసుకుపోయే రాకెట్లను తయారు చేసి, చంద్రలోకములో పాదం మోపాడు మానవుడు, సబ్‌మెరైనులు తయారుచేసి సముద్ర అంతర్భాగంలో సురక్షితంగా ప్రయాణం చేయగల్గుతున్నాడు. మర మనుషుల్ని సృష్ఠించి మానవుడు సునాయాసంగా మహామహా కార్యాలు చేయగలుగుతున్నాడు. మానవుడు హైడ్రోజన్‌ అణుబాంబులవంటి మహా మారణాయుధాల్ని సృష్ఠించి సృష్ఠినే అరక్షణంలో అంతం చేయగల అనంత శక్తిని సంపాదించుకొన్నాడు. మానవుడు గుండెకు బదులు గుండెను, కంటికి బదులు కంటిని వేస్తున్నాడు. మానవుడు ఇవన్నీ ఎలా చేయ గల్గుతున్నాడు? అదే సైన్సు సైన్సు యుగంరా బ్రదర్‌! ఇది. ఇప్పుడు కూడా దేవుడు, దయ్యాలు, సాధులు, సన్యాసులు అని భ్రాంతితో ఉండే మీలాంటి వెర్రివారిని ఏమనాలో తెలియకున్నది.

వేణు :- ఓరేయ్‌ అన్నయ్యా! సైన్సు అని అరుస్తూ నీ సైంటిస్టు బుద్ధి పోనిచ్చుకొన్నావు కాదు. చివరకు మీ సైన్సు ఏమి సాధిస్తుందో తెలుసునా, ప్రపంచాన్ని ఏదో ఒకనాడు ఉపద్రవంలో ముంచివేస్తుంది. ప్రపంచశాంతి ఏనాటికీ కల్పించలేదు. అయినా మీ సైంటిస్టులు, డాక్టర్లు అంతా కంటికి