పుట:Prabodhanandam Natikalu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(అంతలో స్టేజి మీద కృష్ణుడు ప్రత్యక్షమైనాడు)

కృష్ణుడు :- కనిపించే వాడు ఎప్పటికి దేవుడు కాడు. అందువలన కనిపించే కృష్ణుడు దేవుడు కాడు, దేవుడెవరో తెలియాంటే నారదుణ్ణి అడగండి.

(అంతలో అక్కడికి నారదుడు కూడ వస్తాడు)

నారదుడు :- దేవుడెవరు? అన్నది అన్నిటికంటే పెద్దప్రశ్న. ఇది సమస్త మానవులకూ తెలియని ప్రశ్న. ఎందరో, ఎన్నో మతాలను సృష్ఠించుకొని దేవుడు ఫలానా అంటున్నారు. మా వాదనే నిజమని అన్ని మతములవారు అంటున్నారు. వాస్తవానికి ఎవరి మాటలూ సత్యముకావు. దేవుడెవరన్న సత్యమును నానోట, నామాటగా దేవుడే చెప్పించడము నాభాగ్యమని తలచుచున్నాను. దేవుడెవరన్న వివరము భగవద్గీతలో ఈ శ్రీకృష్ణులవారే చెప్పుచు వచ్చారు. నన్నే మ్రొక్కు, నన్నే ఆరాధించు, నేనే సృష్ఠికర్తను, పరమ్మాతను అన్న కృష్ణుడు కూడ ఇపుడు నేను దేవుణ్ణికాదంటున్నాడు. చావుపుట్టుకే లేని దేవుడు ఎవరన్నది ఎవరికీ తెలియదు. దేవుని విషయము తెలిసినవాడు దేవుడొక్కడే. ఆ విషయము మానవులకు తెలియాలంటే ఆయనే చెప్పాలి. ఆ సూత్రము ప్రకారము ఎచ్చట దేవుని ధర్మములు తెలియుచున్నవో, అచ్చట దేవుడే చెప్పుచున్నాడని తెలియాలి. దానిప్రకారము గీతలో సంపూర్ణ జ్ఞానమును తెలియజేసి, నేను తప్ప వేరు దేవుడులేడు అనిన కృష్ణుణ్ణి దేవుడనాలి. కానీ దేవుడు ఇంద్రియ అగోచరుడు అన్న సూత్రము ప్రకారము అయితే కంటికి కనిపించు కృష్ణుడు కూడ దేవుడు కాడు. అందువలన కృష్ణుడు కూడ నేను దేవుణ్ణి కాదు అంటున్నాడు. ఈ మాటయు వాస్తవమే. పరస్పర విరుద్ధవాక్యములను దేవుడు చెప్పునా అని కొందరు ప్రశ్నించవచ్చును. దేవుడు ఎప్పుడూ అలా చెప్పడు. వాస్తవ మేమంటే కనిపించే కృష్ణుని శరరీములోనుండి, కనిపించక మాట్లాడే వాడే