పుట:Prabodhanandam Natikalu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ భూలోకమునందు కరువుకాటకాలకు నిలయమైన ఆఫ్రికాఖండమున పుట్టి ఆకులు, అలుములు తినుచు ఆకలికి తట్టుకోలేక చివరికి పచ్చి ఉడతలను, పచ్చని మిడతలను, తొండలను తినుచు దుర్భరమైన జీవితమును గడుపుదురుగాక! మీ క్రొవ్వు కరుగునుగాక! ఇదే....మోక్షముతో దైవత్వమును పొందిన నాయొక్క శాపము.... ఆ పరమాత్మ ఈ మాయా గురువులకు విధించు శిక్ష!


ఓ ప్రజలారా! ఇప్పటికైన జ్ఞాననేత్రము తెరచి, నిజమైన దైవజ్ఞానమును గుర్తించి, స్వచ్ఛమైన హేతువాదులై, మాయా జ్ఞానమును చెప్పువారిని ప్రశ్నించండి! నిలదీయండి! నిట్టనిలువున తాట వలవండి! నిజమైన దైవమార్గమును గుర్తించి దానిలో ఎదురయ్యే ఏ అడ్డంకులనైన ఎదుర్కొనండి.

శ్లో॥

శ్రేయాన్‌ స్వధర్మో విగుణః పరధర్మాత్వనుష్టితాత్‌ ।
స్వధర్మేనిధనం శ్రేయః పరధర్మో భయావహః ॥

అన్న దేవుని సందేశమే ఊపిరిగా జీవిచండి.


ఆకాశవాణి :- శభాష్‌ రావణబ్రహ్మ! కుక్కకాటుకు చెప్పుదెబ్బవలె నీవిచ్చిన సమాధానము ఈ మానవులను ఆలోచింప చేయునుగాక! నీ గురించి చెడుగా ప్రచారము చేయు మాయా గురువులకు చెంపపెట్టు అగునుగాక! ఇప్పటికైన ప్రజలకు నీపై సదుద్దేశము కలుగునుగాక!


రావణబ్రహ్మ :- నా గురించి ఎందరో చెడుగ చెప్పుకున్నను, నా నిజ స్వరూపమును, నాయొక్క పవిత్రతను ఏనాడో ఈ ప్రపంచానికి తెలియజేసిన ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులకు నా నమస్కృతులు, నేను గొప్ప