పుట:Prabodhanandam Natikalu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా చావు ముహూర్తము తెలిసిన నేను యుద్ధరంగములో పగటిపూట సూర్యకాంతి కల్గిన మిట్టమధ్యాహ్నము, శుక్లపక్షములో, ఉత్తరాయణమున మరణించి, విశ్వవ్యాప్తుడనై అన్ని చూస్తున్నాను. త్రేతాయుగములో నేను ఆటంకపరచిన యజ్ఞములు నేటికినీ సాగుచుండడమేకాక, నన్ను అధర్మ పరుడని అనడమేకాక, యజ్ఞములు, వేదములు, తపస్సులు అధర్మములన్న గీతను కూడ ఎవరూ పట్టించుకోలేదు. అందువలన అలనాటి రావణబ్రహ్మగ మీరు ప్రయాణించు మార్గమేదో తెలుసా? అని అడుగుచున్నాను నేను ఆశించిన సమాజమేనా ఇది? అని ప్రశ్నించుచున్నాను. మాయా ప్రభావము చేత నిజము తెలియక మభ్యపడిపోయి, రావణుడు దుర్మార్గుడని, క్రొవ్వుపట్టిన కామాంధుడని, లోకకంఠకుడని ప్రచారము చేయు ఎందరో స్వాములను, మఠాధిపతులను, పీఠాధిపతులను, పరమహంసలను, మహర్షులను, జ్ఞానము ముసుగు తగిలించుకొన్న మాయా గురువులను ప్రశ్నించుచున్నాను. స్వామి, మహర్షి అను పదమునకు అర్థము మీకు తెలుసునా? తృప్తిగా, రుచికరమైన భోజనము చేయుచు కష్టమనునది లేక సుఖమునకుమరిగి వళ్ళుపెంచిన మీకా క్రొవ్వుపట్టినది? లేక పరాక్రమవంతుడనై యుద్ధ రంగమున అరివీర భయంకరుడై చెలరేగిన నావంటి వీరునికా? మానవుని దైవత్వంవైపు తీసుకుని వెళ్ళవలసిన బాధ్యతగల మీరు, పనికిమాలిన ప్రవచనాలు, పిట్టకథలు, అశాస్త్రీయమైన ఆగమశాస్త్రపు చర్చలు, పుక్కిటి పురాణాలతో కాలక్షేపము చేయుచు సోమరులై, కర్మక్షేపము చేయు మీరు, నిజమైన దేవుని జ్ఞానమును ప్రజలకు అందించక, వారిని మాయా మార్గమున నడిపించుచున్నారు. ఇందుకు తగిన ప్రతిఫలము మీరు తప్పక అనుభవించెదరుగాక! దైవనింద చేసిన వారికి జ్ఞానపు గట్టుకూడ దొరకకుండ చేస్తానని దేవుడు చెప్పిన ప్రకారము, మరుజన్మలోనైన మీరు