పుట:Prabodha Tarangalul.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

746. అహము ముందర చిత్తము బుద్ధి ఉన్నవనీ, ఆ తర్వాత నేనున్నాననీ, అహము ముగ్గురిని కలిసి చూపుతున్నదనీ, మా ముగ్గురికి ఎదురుగ అద్దముగవున్న అహములో బుద్ధి చిత్తము యొక్క భావములు నాయందున్నట్లు కనిపిస్తున్నవనీ, నిజముగ బుద్ధివేరు, చిత్తమువేరు, నేను వేరని ఏ జీవుడు తెలియకున్నాడు.

747. అహమను అద్దమునకు ఎదురుగా లేని మనస్సుయొక్క ఆలోచనలను మనిషి తనవనుకోలేదు. కానీ బుద్ధి చిత్తము యొక్క పనులను తనవే అనుకొంటున్నాడు. అందుకు కారణము అహము ముందర వరుసగా చిత్తము, బుద్ధి, జీవుడు ఉండడమే.

748. మనస్సు చూపు ఆలోచనా దృశ్యాలను జీవుడు తాను ప్రక్కనుండి చూచినట్లే అనుభూతి పొందును. కానీ బుద్ధి చిత్తము పనులలో మిళితమైపోయి అవి తనవే అనుకొన్నట్లు మనోదృశ్యాలను అనుకోడు.

749. మనో ఆలోచనా దృశ్యాలను జీవుడు తనవేననీ, తానేనని అనుకోకుండుట వలన స్వప్నములో మనస్సు చూపు దృశ్యములను తాను ప్రక్కనుండి చూచినట్లుండును. అందువలన మనస్సు చూపువాటిని "ఆలోచన" అంటున్నాడు, కానీ "నాలోచన" అనలేదు.

750. లోచన అనగా చూచుట అని, ఆలోచన అనగా దూరముగా చూచుట అని అర్థము. నీవు మనోభావమును ఎప్పుడు దూరముగానే చూస్తున్నావు. కావున మనస్సు అందించువాటిని ఆలోచనలే అంటున్నావు.

751. పరమతమును గురించి మాట్లాడాలనుకుంటే ముందు నీ మతమును గురించి నీవు యోచించు. పరమతములోని