పుట:Prabodha Tarangalul.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈనుతుంది అని వివరము తెలిసినవాడు ఎద్దు ఈనడమును ఖండించి, ఆవు ఈనుతుంది అని సమర్థించును.

706. ఆవు, ఎద్దు వివరము తెలియనివాడు ఎద్దు ఈనిందంటూనే దూడను కట్టివేయమంటున్నాడు. అలాగే దేవుడు దేవతల వివరము తెలియని నాస్తికులు భక్తి అను పదము వినిపిస్తూనే మూఢనమ్మకము దానిని కొట్టివేయమంటున్నారు.

707. దూడ అంటూనే ఆవుకు పుట్టినదా? ఎద్దుకు పుట్టినదా? అని ఆలోచించక కట్టివేయిమనువారూ, భక్తి అంటూనే దేవుని ఎడల పుట్టినదా? దేవుళ్ళ ఎడల పుట్టినదా? అని ఆలోచించక కొట్టివేయమను ఇద్దరూ మూఢనమ్మకము కలవారే!

708. నాస్తికులు "ఏ దేవుళ్ళను" ఖండించి మాట్లాడాలో, ఆస్తికులు "ఏ దేవున్ని" ఆరాధించి పూజించాలో తెలియనంత వరకు ఇద్దరూ మూఢనమ్మకస్తులే!

709. మొదట పుట్టినపుడు మనిషిగ ఉన్నవాడు, కొంత చదివిన తర్వాత తాను బి.ఎస్‌.సి అనో, యం.ఎ అనో అనుకొనును. తర్వాత ఉద్యోగము చేయుచున్నపుడు తాను కమీషనర్‌ననో, సూపరెంటెండెంట్‌ అనో అనుకొనుచుండును. వాస్తవానికి నేనొక జీవుడనను మాట మరచి పోవుచున్నాడు.

710. ఏ రోగమూ నీ హోదాను కానీ, నీ ఉద్యోగమునుగానీ చూడదు. ఏ రోగమైన నిన్ను ఒక సాధారణ మనిషిగానే లెక్కించి బాధించునని మరువద్దు.

711. నీకు ఎంతో సన్నిహితముగనున్న నీ భార్యగానీ, నీ బంధువుగానీ