పుట:Prabodha Tarangalul.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జవాబులను వెదకకనే తెలియని దానిని లేదనువాడు హేతువాది ఎలా అవుతాడు?

699. మూఢనమ్మకము గలవారిని, గాఢనమ్మకము గలవారిని వదలి, వారి మాటను నమ్మక, స్వయముగ దేవుడు అబద్దముగ ఎలా ఉన్నాడని ప్రశ్నించుకొని, పరిశోధన చేసి కనిపెట్టినవాడు నిజమైన హేతువాది.

700. మామగార్లందరు చందమామ కాలేరు. అలాగే దేవతలందరు దేవుడు కాలేరు. ఎంతమంది మామగార్లున్నా భూమివిూదనే ఉంటారు. కానీ చందమామ ఆకాశములోనే ఉంటాడు. అలాగే ఎందరు దేవతలున్నా వారంతా భూమి విూదనే ఉంటారు. కానీ దేవుడు శరీరములోనే ఉంటాడు.

701. జరుగబోవు తన బ్రతుకు తెరువును గురించి చింతించుట వలననే మనిషిలో భయము ఏర్పడుచున్నది.

702. తన భయమును తీర్చుటకు మనిషి దేవతలను సృష్ఠించుకొన్నాడు. కానీ తనను ముందే దేవుడు సృష్ఠించాడని అనుకోవడము లేదు.

703. తనను సృష్ఠించిన దేవున్ని మరిచి తాను సృష్ఠించుకొనిన దేవతలను ఆరాధించడము మనిషికి ముఖ్యమైన పని అయినది.

704. మనుషులు సృష్ఠించుకొన్న దేవుళ్ళను గురించి నాస్తికులు మూఢనమ్మకమని వాదిస్తున్నారు. కానీ మనుషులనే సృష్ఠించిన దేవున్ని గురించి వారు ఆలోచించడములేదు.

705. ఎద్దు ఈనిందంటే గాటికి కట్టివేయమన్నట్లు, దేవుడు అంటేనే నాస్తికులు మూఢనమ్మకమనుచున్నారు. ఎద్దు ఈనదు, ఆవు