పుట:Prabodha Tarangalul.pdf/82

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


భగవంతుడు భూమివిూదకు వచ్చినపుడు వారి స్థోమత ఏమిటో భగవంతుడు చెప్పు జ్ఞానము వలన బయటపడగలదు.

666. గురువులుగ, స్వావిూజీలుగ, బాబాలుగ, పీఠాధిపతులుగ చలామణి అగువారిలో అసలైన ఆధ్యాత్మికత ఉందో లేదో చెప్పువాడు ఒక్క భగవంతుడే.

667. గురువులకు, స్వావిూజీలకు, బాబాలకు, పీఠాధిపతులకు విభిన్నముగనున్న భగవంతుని ఎవరు గుర్తించలేరు.

668. దేవుడు భూమివిూదకు వేల సంవత్సరములకొకమారు ఎవరికి తెలియకుండ భగవంతుడిగ వచ్చును. భగవంతుడు వేల దినములకొక మారు ఎవరికి తెలియకుండ దేవునిగ ప్రవర్తించును.

669. ఆదరణకర్త అయిన భగవంతుడు మానవులను తన జ్ఞానముతోనే ఆదరించును. అట్లుకాక ధన, కనక, వస్తు, వాహనములనిచ్చి ఆదరించడు.

670. మనిషి భూమివిూద దైవజ్ఞానము ద్వారా తప్ప ఏ దాని చేత నిజమైన ఆదరణ పొందడు.

671. దేవుడు భూమివిూదకు వచ్చునపుడు పలానా మతములో, పలానా కులములో వస్తాడని ఎవరు చెప్పలేరు.

672. శృతి ఉంటే లయ ఉంటుంది, శృతి అంటే జ్ఞానము, లయ అంటే మోక్షము.

673. శృతి లయలు కల్గిన దానిని "సంగీతము" అంటున్నాము. "సం" అనగ మంచి "గీత" అనగ హద్దు. సంగీతము మంచి జ్ఞానము కల్గినదని అర్థము.