పుట:Prabodha Tarangalul.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

554. పుస్తకములోని సమాచారమును బట్టి ప్రకృతికి సంబంధించినదిగ, పరమాత్మకు సంబంధించినదిగ విభజించవచ్చును.

555. పుస్తకములోని సమాచారము కావ్యములుగ, పురాణములుగ, చరిత్రలుగ, శాస్త్రములుగ వ్రాయబడి ఉన్నది.

556. మస్తకములోని విషయములు కూడ తామసముగ, రాజసముగ, సాత్త్వికముగ, యోగముగ పేర్చబడియున్నవి.

557. నోటి నుండి వచ్చుమాట నీతితో(న్యాయముతో) కూడుకొని ఉండాలని, అట్లుకాకపోతే జ్యోతితో(జ్ఞానముతో) కూడుకొనియైన ఉండాలన్నారు. జీవితములో అటు ప్రపంచ న్యాయములోకానీ, ఇటు దైవజ్ఞానములోగానీ ఖ్యాతి గడించాలని అందరికి జ్ఞప్తియుండులాగ మూతి, నీతి, జ్యోతి, ఖ్యాతి అన్నారు.

558. చావులో 24 భాగములతో కూడుకొన్న శరీరము నిన్ను వదలి పోవుచున్నది. అదియే వర్ధంతి.

559. పుట్టుకలో 24 భాగములతో కూడుకొన్న శరీరము నీకు తగులుకొనుచున్నది. అదియే జయంతి.

560. చావుతర్వాత, పుట్టుక ముందు నీకు శరీరములేదు. కానీ అపుడు నీవు, నీ ఆత్మ, నీ కర్మ, నీ గుణములు నాల్గుచక్రముల చట్రములో ఇమిడియున్నాయి.

561. ఆ చక్రముల చట్రము బ్రతికిన శరీరములో నుదిటి భాగములో ప్రతిష్ఠింపబడి ఉన్నది.