పుట:Prabodha Tarangalul.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

536. 'దస్‌' అంటే పది అనీ, 'కత్‌' అంటే విషయములతో కుడుకొన్న జాబులని అర్థము. 'దస్‌ కత్‌' అంటే పది విషయములతో కూడుకొన్నదని (దశేంద్రియముల సమాచారముతో కూడుకొన్నదని) అర్థము.

537. 'సిగ్‌' అనగ గుర్తు అని, 'నేచర్‌' అనగ ప్రకృతి అని అర్థము. 'సిగ్‌నేచర్‌' అనగ ప్రకృతికి గుర్తు అని అర్థము.

538. ఆత్మను గురించి చెప్పుకొంటే ఆధ్యాత్మికము అవుతుంది. జీవాత్మను గురించిగానీ, పరమాత్మను గురించి చెప్పుకొంటే ఆధ్యాత్మికము గాదు.

539. ఒకే పరమాత్మను గురించి చెప్పు అద్వైతులుగానీ, విశిష్టాద్వైతులు గానీ, జీవాత్మ పరమాత్మలను ఇద్దరిని గురించి చెప్పు ద్వైతులుగానీ, ఆత్మను గురించి చెప్పనిదే ఆధ్యాత్మికులు కాలేరు.

540. ఆత్మను గురించి సవివరముగ చెప్పుచున్న త్రైతులు మాత్రమే నిజమైన ఆధ్యాత్మికులు.

541. తెలియని దానిని తెలుపునది ఆత్మ మాత్రమే. అందువలన పరిశోధన ఆత్మదే! సిద్ధాంతమూ ఆత్మదే!!

542. ఈశ్వరుడు అనగా అధిపతి అని అర్థము. జీవేశ్వరుడు అనగా ఆత్మ, పరమేశ్వరుడు అనగా పరమాత్మ, ఏ ఈశ్వరుడుకాని వాడు జీవాత్మ.

543. అయమాత్మ బ్రహ్మ అనుమాట పూర్తి తప్పుు. నీ ఆత్మ ఆత్మేకానీ బ్రహ్మకాదు.