పుట:Prabodha Tarangalul.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

526. గుణములలోని అరిషట్‌వర్గములోని మొదటి ఆశా చివరి అసూయా రెండూ ప్రత్యేకముగ మనిషిలో పనిచేయుచున్నవి.

527. అంతఃకరణములలోని మొదటి మనస్సు చివరి అహము రెండూ ప్రత్యేకించి పని చేయుచున్నవి.

528. శరీరములోని మనస్సును గుఱ్ఱముగ, అహమును కాకిగ పోల్చవచ్చును.

529. మనో విషయములను గుఱ్ఱపునాడగ, అహంకార పనులను కాకినాడగ చెప్పవచ్చును.

530. గుఱ్ఱపునాడను లేకుండ చేసుకొంటే బ్రహ్మయోగమూ, కాకినాడను లేకుండ చేసుకొంటే కర్మయోగమూ లభ్యమగును.

531. ఆధ్యాత్మికమనునది శరీరము బయటలేదు. శరీరములోపలే ఉన్నది.

532. పక్షి పగలు ఎంత ఎగిరినా సాయంకాలమునకు తిరిగి తన గూడును చేరినట్లు, మనసు ఎన్ని విషయములలో తిరిగినా చివరకు తిరిగి తన గూడు అయిన బ్రహ్మనాడినే చేరును.

533. నీవు అందరికి మామ అవ్వాలంటే చందమామకావాలి. చందమామ కావాలంటే దైవజ్ఞానము తెలియాలి.

534. "" అంటే కాదు అని అర్థము. "మమ్‌" అంటే నేను అని అర్థము. "నామమ్‌" అంటే నేను కాదు అని అర్థము.

535. "సం" అంటే జ్ఞానము, "అంతకమ్‌" అంటే ఏమాత్రములేనిది అని, అంతమైపోయినదని అర్థము. సంతకము అంటే జ్ఞానములేనిదని అర్థము.