పుట:Prabodha Tarangalul.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

510. ఒక మనిషిని దేవుడంటుంటారు కాని మనిషిలో దేవుడున్నాడని, దేవునిలో మనిషున్నాడని చాలామందికి తెలియదు.

511. అంతులేని ప్రకృతి పరమాత్మ హద్దులో ఉన్నది. అలాగే ప్రకృతి స్వరూపమైన స్త్రీ, పరమాత్మ స్వరూపమైన పురుషుని హద్దులో ఉండడము ధర్మము.

512. ఏ సిద్ధాంతమైన మనిషిలోపల ఊహకందినదే, మనిషిలోపల ఊహకందించినవాడే సిద్ధాంతకర్త. అటువంటపుడు సిద్ధాంతకర్తగ లోపలి వానిని చెప్పకుండ బయట మనిషి పేరు చెప్పుకోవడము అధర్మము కాదా!

513. పెళ్లంటే నూరేళ్ళపంట అంటారు. జీవితమంటే మూన్నాళ్ళ ముచ్చట అంటారు. దీనినిబట్టి జీవితముకంటే పెళ్ళే పెద్దదని తెలియుచున్నది.

514. నాలుక అంటే భయములేనిదని అర్థము. అలాగే నీవు కూడ తలలోని నాలుకవలె ఉండవలెను.

515. ధనమున్నవాడు తనవద్ద ధనము లేదని చెప్పడము, జ్ఞానము తెలియనివాడు తనకు జ్ఞానము తెలుసునని చెప్పుకోవడము సహజము.

516. ఊహ ఒక్కమారు మాత్రము వస్తుంది. ఆలోచన అనేకమార్లు వస్తుంది.

517. ఊహ ఆత్మది, ఆలోచన మనస్సుది. మనస్సు ఊహించిందని, ఆత్మ ఆలోచించిందని అనకూడదు.