పుట:Prabodha Tarangalul.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

495. శరీరములోపల వచ్చు రోగము, మనోరోగము స్వయముగ యముడు (ఆత్మ) విధించు బాధలని, శరీరము బయటినుండి వచ్చు బాధలు యమకింకర్లు (బంధువులు, శత్రువులు) విధించు బాధలని తెలియవలెను.

496. జీవితములో జరుగు బాధలుగాని, సుఖములుగాని అన్నిటికి మూలకారణము శరీరములోనున్న కర్మయే కారణమని తెలియాలి.

497. సుఖ దుఃఖములు అనుభవించుటకు కారణమైన కర్మ నీతలలోని కర్మచక్రము నుండి ప్రారబ్దరూపముగ వచ్చుచున్నది. అలాగే చేయుచున్న పనులలో సంభవించెడి క్రొత్త కర్మయిన ఆగామికర్మ కర్మచక్రములోనే చేరుచున్నది.

498. జీవితమునకే కారణమయినది మరియు మరణములో శరీరము నుండి సూక్ష్మముగ పోవుచు జననములో ఎవరికి కనపడకుండానే శరీరములోనికి వచ్చుచున్నది ఒక ఆకారము గలదు. అదియే బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రముల చట్రము. ఈ నాల్గుచక్రములలోనే ఆత్మ, జీవాత్మ, ప్రారబ్ధ సంచిత కర్మలు, కర్మలు అనుభవించు కాలము, ఆ కాలములో చరించు నవగ్రహములు గలవు. ఈ నాల్గు చక్రములను తెలుసుకొని వాటి స్థానమైన నుదుటి భాగములో ధరించడము గొప్ప జ్ఞానమగును.

499. సాధారణ స్థితిలో ఉన్నవాడు త్రైతములో గలడు
జ్ఞానయోగములో ఉన్నవాడు ద్వైతములో గలడు.
మోక్షము పొందినవాడు అద్వైతములో గలడు.