పుట:Prabodha Tarangalul.pdf/62

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తెలుపుటకు రూపములేని గుండును లింగముగ, రూపమున్న రంగని ప్రతిమగ పూర్వము చూపించారు.

489. దేవునికి అందరు సంతానమేనని తెలియునట్లు, వైవాహిక జీవితము యొక్క అర్థము మొదటిలోనే తెలియునట్లు, పెళ్లి కూతురు పెళ్లికొడుకు అని ఆ కొద్దిసేపు అంటున్నాము.

490. పెళ్లి జీవితములో ఒక పెద్ద జ్ఞానసందేశమైన కార్యము. పెళ్లిలో చేయబడు ప్రతి కార్యమునందు విశేషమైన జ్ఞాన అర్థము ఇమిడి ఉండును.

491. పెళ్లి జరిగిన తర్వాత పెళ్లిలో చేసిన కార్యములకు అర్థము తెలియక, వారి జీవితములో జ్ఞానము తెలియక ప్రవర్తించితే, వారు భార్యాభర్తలు కారు. అది స్త్రీపురుషుల అక్రమ సంబంధ మగును. పెళ్లి కార్యముల అర్థములకు అనుగుణముగ నడుచుకొనువారే నిజమైన భార్యాభర్తలు.

492. పెళ్లిలో తాళికట్టక ముందు పెళ్లికి కొడుకు కూతురై, సోదరి సోదరులైన స్త్రీపురుషులు పెళ్లి తర్వాత వారి జ్ఞాన ఆచరణతో భార్య (భరించబడునది) భర్త (భరించువాడు) సమానమైన బాధ్యతలు కలిగి ఆలుమగలు కావలెను.

493. యమలోకము స్వర్గలోకము రెండు మానవుని జీవితములో మిళితమై ఉన్నవి. యమ స్వర్గలోకములు పైనో క్రిందో లేవు. రెండు భూమిమీదనే గలవు.

494. సుఖముల రూపముతో స్వర్గలోకము, దుఃఖముల రూపముతో యమలోకము ఇక్కడే గలవు.