పుట:Prabodha Tarangalul.pdf/52

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


409. ఆసక్తిని బట్టి బుద్ధియొక్క పని తీరుండును. అందువలన ఒక విషయములో పనిచేసినట్లు మరొక విషయములో పనిచేయలేదు.

410. మహిమ గలది మంత్రము. కాని దాని పూర్తి విధానము తెలియని వారు మంత్రములే లేవనుచున్నారు.

411. ప్రతిమాట ఒక మంత్రమను నానుడి గలదు. అందువలన ఉచ్చాటనను బట్టి మంత్రము మహిమగలదగును.

412. మాటలోని అక్షరములను బట్టి మంత్రములోని మహిమ ఉండును. మాటను క్రమబద్దీకరిస్తే మంత్రమగును.

413. మంత్రశక్తి సూక్ష్మమైనది అయినప్పటికి అది స్థూల సూక్ష్మముల రెండిటి విూద పనిచేయును.

414. కనిపించు ఏనుగును క్షణములో లేకుండ మాయము చేసిన మాంత్రికున్ని, కనిపించని జంతువును క్షణములో కనిపించునట్లు చేసిన మాంత్రికున్ని చూచినపుడు ఆ పనులు మంత్రమహిమ అని చెప్పక తప్పదు.

415. ధర్మము దైవసంబంధమైనది. దానము ప్రపంచసంబంధమైనది.

416. దానమడుగు ప్రతివాడు ధర్మము చేయండి అనడములో ధర్మమును ఆచరించమని చెప్పడమే అగుచున్నది.

417. దానము చేస్తే పుణ్యము వస్తుంది, పుణ్యమువస్తే మరుజన్మ వస్తుంది. అందువలన దానము చేస్తే నేను తెలియనని గీతయందు భగవంతుడు చెప్పాడు.