పుట:Prabodha Tarangalul.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

397. మనిషికి నిద్ర మెలుకువలు మనస్సును బట్టియే ఉండును. శరీరమంతా మనస్సు వ్యాపించినపుడు (సూర్య చంద్రనాడులలో ఉన్నపుడు) మెలుకువ అని, బ్రహ్మనాడిలో అణగిపోయినపుడు నిద్ర అని అంటాము.

398. మనిషి మనస్సును జయించితే బ్రహ్మయోగము (జ్ఞానయోగము) అగును.

399. మనస్సుకు నేత్రమూ దృష్ఠికలదు. దానినే మనోనేత్రమనీ మనోదృష్ఠి అని అంటుంటాము.

400. మనస్సుకు చివరి మరుపునే మరణము అంటాము.

401. మనస్సుకు బుద్ధికి, బుద్ధికి మనస్సుకు నిత్యము అనుబంధముండును.

402. బుద్ధి గుణములకు అద్దములాంటిది.

403. ప్రతి గుణమును రెండు విధముల యోచించునది బుద్ధి.

404. శరీరములో జీవునితో సంబంధము గలది, కష్టసుఖములను అందించునది ఒక బుద్ధియే.

405. శరీరములో అన్నిటికంటే గొప్పది బుద్ధియే.

406. శరీరమందున్న ఆత్మవిషయమును జీవాత్మకు తెలియజేయునది బుద్ధి మాత్రమే.

407. జీవునికి అత్యంత సవిూపములో ఉన్నది బుద్ధి మాత్రమే.

408. బుద్ధికి ఆకారముగలదు. ఒక్కొక్క శరీరములో ఒక్కొక్క మందము గల గుండ్రని పొరగ బుద్ధిగలదు.