పుట:Prabodha Tarangalul.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

367. అన్నిటికీ ఆధారము, అన్నిటికీి పెద్ద, అన్నిటికీి మూలము ప్రకృతి కాదు. ఆత్మ, జీవాత్మ కాదు. అన్నిటిని ఆడించునది మాయ కాగ దానిచేత ఆడించువాడు పరమాత్మ. కావున అన్నిటికి ఆధారమూ, పెద్దా, మూలము పరమాత్మయే.

368. జీవుని దైవారాధనకు మరియు శరీర పోషణకు యజ్ఞములు ముఖ్యమైనవి.

369. శరీరములో రెండు రకముల యజ్ఞములు చేయవచ్చును. అందులో ఒక దానిని నిత్యము అందరు చేయుచున్నాము. దానిపేరే ద్రవ్యయజ్ఞము.

370. శరీరము రెండు రకముల యజ్ఞములకు వేదిక అయినది. కడుపులో జరుగు ద్రవ్యయజ్ఞముకంటే తలలో జరుగు జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది.

371. యజ్ఞము అనగ ఉన్నదానిని లేకుండ చేయడమని లేక కాల్చివేయడమని నిజార్థము. నోటి ద్వార తినబడు ఆహార ద్రవ్యములను కడుపులోని జఠరాగ్ని ద్వార కాల్చివేయడమును ద్రవ్యయజ్ఞము అంటున్నాము.

372. శరీరములో జరుగు యజ్ఞమునకు నమూనాగా చేసి చూపడమే బయటి యజ్ఞములు. యజ్ఞములో అగ్ని ద్వార కాల్చు విధానమే శరీరములో జరుగు రెండు యజ్ఞములలో గలదు.

373. శరీరమందు జరుగు జ్ఞానయజ్ఞము ద్రవ్యయజ్ఞముకంటే శ్రేష్టమైనది. ఎందుకనగా జ్ఞానయజ్ఞములో ప్రపంచ సంబంధ పంచ జ్ఞానములు కాలిపోవుచున్నవి.