పుట:Prabodha Tarangalul.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

349. భౌతికముగ శరీరము యొక్క బయటి లోపలి అవయవములను తెలిసిన డాక్టర్లకు సూక్ష్మముగనున్న మనోబుద్ధులు గుణకర్మలు ఏమాత్రము తెలియవు.

350. జ్ఞాని అనువానికి స్థూల సూక్ష్మ శరీరములు తెలిసి ఉండవలెను.

351. దేవున్ని తెలియవలసినది ఆరాధించవలసినది శరీరములోనే కావున జ్ఞానులకు పూర్తి శరీరమును గురించి తెలియవలసి ఉన్నది.

352. దేహమునందు నివశించు దానిని దేహి అంటాము. దేహములో నిండియున్నది ఆత్మ, దేహములో ఒక్క స్థానములో ఉన్నది జీవాత్మ.

353. ఆత్మ చైతన్యమైనది కావున ఆత్మ శరీరములో ఉన్నంతసేపు శరీరము కూడ చైతన్యమగుచున్నది.

354. ఆత్మ విడచి వెళ్లిన శరీరము చైతన్యము లేనిదై పోవును.

355. జీవాత్మ స్వయముగ శరీరమును విడచి వెళ్ళడము గాని, శరీరములోకి చేరడము గాని చేయలేదు.

356. జీవాత్మను శరీరములోకి చేర్చడము మరియు శరీరమునుండి బయటికి తేవడమును ఆత్మే చేయుచున్నది.

357. జీవాత్మకు, పరమాత్మకు మధ్యలో ఉన్నది ఆత్మ.

358. జీవాత్మకు ఆత్మకు, ఆత్మకు పరమాత్మకు, పరమాత్మకు ప్రకృతికి ప్రకృతికి జీవాత్మకున్న సంబంధములను తెలియజేయునదే నిజమైన దైవజ్ఞానము.