పుట:Prabodha Tarangalul.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

317. ఆత్మ జీవాత్మలు రెండు జోడు ఆత్మలుగ ఉన్నవి. జీవాత్మను వదలి ఆత్మ, ఆత్మను వదలి జీవాత్మ ఉండజాలదు.

318. శరీరములో సూది మోపినంత జీవాత్మ ఉండగ, సూది మోపినంత కూడ వెలితి లేకుండ పరమాత్మ విశ్వమంత వ్యాపించి ఉన్నది.

319. జీవాత్మకు ఒకే ఆకారముండగ ఆత్మకు అనేక ఆకారములుండగ పరమాత్మకు ఆకారమే లేదు.

320. జీవాత్మకు ఆత్మకు స్థానము, ఆకారము, పేరు, పని ఉండగ పరమాత్మకు అవేవి లేవు.

321. భూమి విూద ప్రచారమైన గుణములు ఆరే. వాటినే ఆరు శత్రుగుంపు (అరిషట్‌ వర్గము) అనుచున్నాము. ప్రచారము లేని గుణములు మరొక ఆరుగలవు వాటినే ఆరు మిత్రగుంపు (మైత్రి షట్‌ వర్గము) అంటాము. మైత్రిషట్‌ వర్గము గుణములను గురించి ఎవరికి తెలియదు. వాటిని మనమే (శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానందయోగీశ్వరులే) మొదట చెప్పుకొన్నాము.

322. గుణములు శత్రువర్గముగ ఆరు, మిత్రవర్గముగ ఆరు మొత్తము పండ్రెండు గలవు. వాటి ప్రతిరూపమే మాయ.

323. దేవుడు సృష్ఠించిన మాయ, గుణముల రూపముగ మనుషుల తలయందేగలదని చాలామందికి తెలియదు.

324. పరమాత్మ ప్రపంచమంత, ఆత్మదేహమంతట వ్యాపించి ఉన్నప్పటికి, తలయందు గుణరూపమై ఒక్క చోటున్న మాయ, జీవున్ని తనవైపే లాగుకొనుచున్నది.