పుట:Prabodha Tarangalul.pdf/34

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


256. నీతల్లీ తండ్రీ నమ్మకమే, కానీ నీమతమూ నీకులమూ మూఢనమ్మకము.

257. శాస్త్రము నమ్మకము, పురాణము మూఢనమ్మకము.

258. శాస్త్రబద్ధమైన నమ్మకము ఎప్పటికీ వమ్ము కాదు. హేతుబద్ధము కాని మూఢనమ్మకము ఎప్పటికీ సత్యము కాదు.

259. దేవున్ని ఆరాధించడము నమ్మకము కానీ, చిల్లర దేవుళ్ళను ఆరాధించడము మూఢనమ్మకమగును.

260. నమ్మకములుండవచ్చును, ఉండకపోవచ్చును. కానీ మూఢనమ్మకములు ఏమాత్రముండూడదు.

261. జ్యోతిష్య శాస్త్రములో నమ్మకమున్నది, వాస్తు శాస్త్రములో మూఢనమ్మకమున్నది.

262. అజ్ఞాన మనుషులను సేవించవద్దు, జ్ఞానులను సేవించడములో జీవితమునకు జ్ఞానము లభ్యమగును.

263. మనస్సుకు ఆకారమున్నది, కానీ దాని పనికి హద్దులేదు.

264. లోచనము అనగా కన్ను . లోపలి కన్నును ఆలోచన అంటారు.

265. బయటి కన్నులు రెండు కలసి ఒకదృశ్యమును చూపును. లోపలి కన్నులు రెండు కలవవు.

266. మనిషికి పుట్టుకతో వచ్చునవి రెండు కన్నులు, పెరుగుతా వచ్చునవి రెండు కన్నులు.

267. లోపలి కన్నులు రెండు విభిన్నమైనవి. ఒకటి ప్రపంచ