పుట:Prabodha Tarangalul.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

224. ఒక కథలో గల మంచి చెడులలో మంచిని గ్రహించు, చెడును విసర్జించు.

225. ఒక మనిషిలో గల జ్ఞాన అజ్ఞానములలో జ్ఞానమును గ్రహించు అజ్ఞానమును విసర్జించు.

226. మనిషి చెప్పు మాటలలో అన్నీ నిజమని నమ్మకు, దేవుడు చెప్పిన మాటలలో అన్నీ నిజమేనని తెలుసుకో!

227. భూమిమీద మిత్రులు శత్రువులున్నట్లు, శరీరమునందు జీవునకు మిత్రులను గుణములు, శత్రువులను గుణములు రెండురకములు గలవు.

228. పులుపుకు ఉప్పు, చేదుకు తీపి ఎట్లు వ్యతిరిక్తముగ ఉన్నవో అట్లే శరీరములో కామమునకు దానము, కోపమునకు దయ, లోభమునకు ఔధార్యము, మోహమునకు వైరాగ్యము, మదమునకు వినయము, మత్సరమునకు ప్రేమ అనునవి వ్యతిరిక్తము.

229. ఉప్పు నీటిలోకరిగి తెలియకుండా ఉండినట్లు, మాయ శరీరములో ఇమిడి ఉన్నది.

230. ఆదేశము అధికారముతో కూడుకొన్నట్లు ఉపదేశము అనధికారముతో కూడుకొన్నదై ఉన్నది.

231. దృష్టికి దేశము ప్రదేశము కనిపించునట్లు, జ్ఞానదృష్టికి ఉపదేశము అప్రదేశము తెలియును.

232. కంటికి దృష్టి గలదు, అట్లే బుద్ధికి జ్ఞానదృష్టి గలదు.

233. రోగానికి ఔషధము, మాయరోగానికి దివ్య ఔషధము అవసరము.