పుట:Prabodha Tarangalul.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

206. ద్రవ్యయజ్ఞానికై పెట్టుబడి కర్మను సంపాదించుకొంటున్నావు. కర్మయజ్ఞానికై జ్ఞానం సంపాదించుకో కడతేరుతావు.

207. అన్ని జీవులు పాలాక్షులే, కానీ కొన్ని జీవులకు మాత్రమే ఆ కంటికి చూపుంటుంది.

208. గుణాలు నీతలలోనూ, గుణాల పనులు నీకళ్ళముందున్నాయి గుర్తుంచుకో.

209. అహంకారము నీకు కర్మను కలిగిస్తే ఆ కర్మ సుఖదుఃఖములను కలిగిస్తుంది. గురుసేవ నీకు జ్ఞానమును కలిగిస్తే, ఆ జ్ఞానము నీ కర్మను తొలగిస్తుంది.

210. కర్మ ఎలా కలుగుతుందో తెలుసుకో, ఎలా తొలుగుతుందో సులభముగ తెలుస్తుంది.

211. ఆశలు నీజ్ఞప్తిని అలలుగొట్టించి చలింపజేస్తున్నాయి.

212. జరిగే భవిష్యత్తును గురించి తెలుసుకొనడమువలన నీకు ఒరిగేదేమీ లేదు. జరిగేది నీవు తెలుసుకొన్నా తెలుసుకోకున్నా జరిగి తీరుతుంది.

213. నీకు అపజయం కలిగే శకునాన్ని విజయం చేకూర్చే వరకు ఆహ్వానించు.

214. శరీరం చలిస్తున్నా మనస్సు చలింపకుండా జేయువాడే మహాత్ముడు. శరీరం చలింపకుండా మనస్సును చలింపజేయువాడు మందాత్ముడు.