పుట:Prabodha Tarangalul.pdf/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


124. ఆత్మస్థితినందుకొనువరకు అనుక్షణము ఆరాటపడుము అదే నీ జీవిత లక్ష్యము.

125. విభిన్న రూపాలుగల ప్రకృతి యొక్క పంచభాగాలలో ఏకత్వంగా ఇమిడి ఉన్న పరమాత్మను ఆకళింపుచేసుకో, అప్పుడే నీ అంతరంగములోనున్న అజ్ఞానము నీకందనంత దూరంగా పారిపోతుంది.

126. నీ శరీరము స్త్రీ, అందులోవున్న నీవు పురుషుడవు, మీఇరువురి కలయిక వలన నీ శరీరము చైతన్యవంతమౌతున్నది.

127. అనుభవము లేని ఆత్మబోధ, ఆకర్షణలేని అందములాంటిది.

128. నరక, స్వర్గలోకాలన్నీ నరలోకములోనే ఉన్నాయి. ఏస్థలములో జీవుడు కష్టమనుభవిస్తున్నాడో ఆ ప్రదేశమే వానిపాలిట నరకలోకము. ఏస్థలములో జీవుడు సౌఖ్యమనుభవిస్తున్నాడో ఆ స్థలమే వానిపాలిట స్వర్గధామము.

129. కర్మవర్జితుడే అసలైన స్వతంత్రుడు.

130. ఆత్మజ్ఞానానికి ఉపయోగించని ఐశ్వర్యం, అంగబలం, ఆయుస్సు ఊరులో గాచిన వెన్నెలవలె వ్యర్థమైనవగును.

131. మొదట అమృతంలావుండి చివర విషంగా పరిణమించేవే ప్రపంచ విషయాలు. మొదట విషంలావుండి, చివర అమృతంలాగ ఉండేవి జ్ఞానవిషయాలు.

132. సూర్యోదయం కూడ పోగొట్టజాలని చీకటి ఒకటుంది అదే అజ్ఞానము. అది జ్ఞానోదయముతోనే పోవును.

133. జ్ఞానం తెలియని సాధన దారి తెలియని నడకవంటిది.