పుట:Prabodha Tarangalul.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


115. విషయచింతనము వీడి పరమార్థ చింతనము పట్టుబడిన నాడే మానవుడు స్వచ్ఛమైన జీవితము గడుపగలడు.

116. నిన్ను నీవు తెలుసుకొంటే నీలోని అహమేమిటో తెలియును.

117. మంచిని ఆలోచించినా, చెడును ఆలోచించినా ఏది జరగాలో అదే జరిగితీరుతుంది.

118. భోగాలన్నీ అనుభవించిన తరువాత యోగసిద్ధి పొందవచ్చునని యోచించకు, అప్పుడు రోగసిద్ధి కలుగవచ్చును.

119. ప్రతి జీవికి భక్తి ఉంటుంది. అది ప్రకృతి భక్తి కాకుండ పరమాత్మ భక్తి అయితేనే మంచిది.

120. కామ్యార్థపూజలకు కారణము దేవాలయాలు కాదు. ఆత్మార్థ మరయుటకే ఆర్యులు దేవాలయములు నిర్మించారు.

121. సుజ్ఞానము లేని నరుని బ్రతుకు, సుగంధము లేని పుష్పము యొక్క అందము ప్రయోజనము లేదు.

122. తలలోని తలపులు దైవానికర్పిస్తే తరిస్తారు కాని తలకురులర్పిస్తే తరిస్తారా?

123. కర్పూరం అగ్నిచే కాలి నిశ్శేషమైన తరువాత కర్పూరము మరియు అగ్ని లేకుండా శూన్యములో ఎట్లులయింపబడునో, అట్లే జ్ఞానమను అగ్నిచే కాల్చబడుతున్న కర్మ నిశ్శేషమైన తరువాత కాలుచున్న కర్మ మరియు కాల్చుచున్న జ్ఞానము రెండుపరమాత్మలో లయించిపోవుచున్నవి.