పుట:Prabodha Tarangalul.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

69. కర్మ లేనిదే కనురెప్ప కూడా కదలదు. అహము లేనిదే ఏ కర్మ రాదు.

70. జీవుని కర్మను కార్యరూపముతో కష్టసుఖాలను అనుభవింప- చేయుటకే ప్రకృతి శక్తులు లోపల బయట ప్రబలి ఉన్నాయి.

71. జీవుడు అహంకారముతో చేయు అన్ని పనులకు రెండు విధాల ఫలితాలుంటాయి, అవి 1) స్థూల ఫలము 2) సూక్ష్మ ఫలము . 72. జీవుడు వెనుక జన్మలలో సూక్ష్మ ధనము (కర్మ)ను ఈ జన్మలో స్థూలంగా అనుభవిస్తున్నాడు. ఈ జన్మలోని సూక్ష్మఫలమును తరువాత జన్మలలో అనుభవిస్తుంటాడు.

73. జీవుడు సంపాదించుకొనేది పాపమూ, పుణ్యము. అనుభవించేది దుఃఖము, సుఖము.

74. మంచివైనా, చెడువైనా వాటి ఫలితాలమీద ఆశ వదలి కార్యములు చేస్తే వాటి కర్మ జీవులకంటదు.

75. మనస్సనే పశువును జ్ఞానమను ఖడ్గముచే ఆత్మకు బలిచేయుము అప్పుడే అవ్యయానందమనే వరాన్ని ఆత్మ ప్రసాదిస్తుంది.

76. ఆనందమనే ఆశచూపి అన్ని కష్టాలు పెడుతున్నది మాయ, జీవుల మాయాసమ్మోహిత మగ్నులజేసి, పంచభూతములను పరికరములచే పరమాత్మ ఇస్తున్న ఇంద్రజాల ప్రదర్శనమే ఈజగత్‌ చర్యలు.

77. కుతంత్రాలతో బుద్ధి, మంతనాలతో మనస్సు, నిర్ణయాలతో చిత్తము, జీవుని కీర్తించడములో అహము ఎడతెరపి లేకుండ ఉన్నవి.