పుట:Prabodha Tarangalul.pdf/105

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కదిలెడి వృక్షమైన మనిషికి వేరువేరు పేర్లుగల కాయలు కాస్తున్నాయి. ఒక కాయపేరు గుండెకాయ అయితే, మరొక కాయపేరు తలకాయ!

820. దేశ పరిధిలోని రాజ్యాంగమును తెలుపునది చట్టము. శరీర పరిధిలోని యంత్రాంగమును తెలుపునది ధర్మము.

821. నాస్తికులను శరీరము విూద గుడ్డలులేని పిచ్చివారిగా పోల్చ వచ్చును. హేతువాదులను అప్పుడప్పుడు ఎవరివద్దనైన గుడ్డలులేని వేశ్యలుగా పోల్చవచ్చును. ఆస్తికులను భర్తను వదలి ఎవరికి తెలియక ఇతరులతో కూడు కులటలుగా పోల్చవచ్చును. ఆత్మవాదులను తన భర్తతో మాత్రమే కాపురము చేయు పతివ్రతలుగా పోల్చవచ్చును.

822. కన్న తండ్రివలన ధనమును హక్కుగ పొందవచ్చును. కానీ అది నీ మరణములో నీవెంటరాదు. గురువువలన జ్ఞానధనమును హక్కుగ పొందవచ్చును. అది చావులో నీతోపాటు వచ్చును.

Prabodha Tarangalul.pdf

అసత్యమును వేయిమంది చెప్పినా అది సత్యము కాదు,
సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యము కాదు.