పుట:Prabodha Tarangalul.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

813. దేవుడిలో కలిసిపోవాలనుకున్న నీవు ఎవరిలో కలుస్తున్నావో చూచుకో. దేవునిలోనికి ఐక్యము కావడానికి ముందే మాయలో ఐక్యమగు అవకాశము ఎక్కువ కలదు జాగ్రత్త!

814. జీవుడు రవ్వంత! ఆత్మ శరీరమంతా!! పరమాత్మ బ్రహ్మాండమంతా!!! మాయ గుణమంత కలదు.

815. గుణ అనగా హెచ్చింపు. సందర్భమునుబట్టి అవసరమును బట్టి మాయ తన్నుతాను హెచ్చించుకొని ఎంత ఎక్కువగానైన పెరుగగలదు.

816. తన్నుతాను ఎంతైనా హెచ్చించుకొనును కాబట్టి మాయను "గుణ" అని అంటాము. "గుణ" అనునది 12 విధములుగా ఉన్నది. అందువలన మనిషికి 12 గుణములున్నవని అంటున్నాము.

817. మ్రొక్కేవాడుంటే ఎవడైన స్వామి, గురువు అవుతాడు కానీ ఎవరు మ్రొక్కాలి? ఎవరు మ్రొక్కించుకోవాలి? అని తెలియని స్వావిూజీలు భూమి విూద ఉన్నారు.

818. భూమివిూద కదలని వృక్షములని, కదిలే వృక్షములని రెండు రకములు కలవు. కదలని వృక్షమునకు కాయలున్నట్లే, కదిలే వృక్షమునకు కూడ కాయలు కలవు. కదలని వృక్షమునకు ఒకే జాతి ఒకే రకము కాయలు కాస్తే, కదిలెడి వృక్షమునకు అనేక జాతుల అనేక రకముల కాయలు కాస్తున్నవి.

819. కదలని వృక్షమైన వేపచెట్టుకు ఒకే పేరుగల వేపకాయలే కాయును. అవి అన్నీ చేదుగా ఒకే రుచి కల్గియుండును.