పుట:Prabodha Tarangalul.pdf/103

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


805. దేనికి ఏ మంత్రము ఉపయోగించాలో మాంత్రికునికే తెలుసు. అలాగే ఎవరికి ఏ జ్ఞానపు మాటలు చెప్పాలో గురువుకే తెలుసు.

806. ఏ పోలీసుకైన గురువుంటే మంచిది. గురువువలన లభించిన జ్ఞానము వలన కరడుకట్టిన నేరస్తుడినైన మార్చవచ్చును.

807. నీవు గురువు వలన జ్ఞానము పొంది, దానివలన నీ జీవితములో ఒక్కడినైన మార్చగలిగితే నీ జీవితమునకు సార్థకత చేకూర్చినట్లే.

808. జ్యోతివలన కటికచీకటైనా పోతుంది. జ్ఞానము వలన కటిక మూర్ఖుడైనా మారగలడు.

809. దీపము అప్పుడు ఎదురుగావున్న వస్తువులోని అందమును తన వెలుగు ద్వారా తెలియచేస్తుంది. అలాగే జ్ఞానము అప్పుడు ఎదురైన సమస్యలోని సత్యమును తన వివరముద్వారా తెలియజేస్తుంది.

810. హారములో దారము దాగివుంది. శరీరములో ఆత్మ దాగివుంది. హారములోని దారమును స్థూలముగా వెదికితే కనిపిస్తుంది. అలాగే శరీరములోని ఆత్మను సూక్ష్మముగా వెదికితే కనిపిస్తుంది.

811. దేవుడు భూమివిూదకి భగవంతునిగా వస్తే ఎవరు గుర్తించలేరు. అయినా గుర్తించుటకు అవకాశము సూక్ష్మముగ వున్నవారికే ఎక్కువగలదు. తర్వాత జ్ఞానులకు గలదు.

812. పాము తనలావుకంటే పదింతలు పెద్దయిన జంతువునైన సులభముగ మ్రింగును. అలాగే మాయ పది సంవత్సరముల జ్ఞాన అనుభవము కల్గినవారినైన సులభముగ తనలో కలుపుకొనును.