శాసననిర్వహణస్వరూపము
97
కానున్నను నష్టముండదను వాద మాలోచింపదగినదే. కాని కుశలుడగు మానవుడు మహాజనోత్సాహమును తనవై పు త్రిప్పుకోగలడను అవిశ్వాసము ప్రజలను అక్షరానభిజ్ఞులుగా నుంచినంతకాలము తప్పదు. అందుచేతనే అంతటను పంచాయతీపరిపాలననే యేర్పరచినా దానికి బునాది ప్రజలేకాక వారి మాతృభాషయు కావలసినదని గట్టి యభిప్రాయ మేర్పడియున్నది. రష్యాలోను భాషాధారకరాష్ట్రము లేర్పరచియున్నారు. మన కాంగ్రెసు మహాసభవారు దేశభాషాధారక రాష్ట్రాలను కాంగ్రెసు కార్యక్రమమునకు అంగీకరించియున్నారు. ఆంధ్రోద్యమమునకు, ఆంధ్రరాష్ట్ర వాంఛకు గూడ మనరక్తములో నిమిడియుండు నుత్సాహమునకు కారణమును ఇదే. రాజ్యాంగ నిర్వహణము నేడు కాంగ్రెసువారి హస్తగతమయినది కాబట్టి నేటినుండే పంచాయతిపరిపాలన, భాషాధారక రాష్ట్రనిర్మాణము వీరు సాధింపవలెను. సాధింపగలరని దేశమెదురుచూచును, ఇంతేకాదు. కార్మిక, కర్ష కాది ఉద్యమములను సరియైనరీతిని ప్రోత్సహించి సార్వజనికవిద్యను అచిరకాలమున సాధించి ఈ యెల్ల బలమును సంపూర్ణ స్వాతంత్య్రసంపాదనకు సమకూర్చు కొనడమే గాక ముందుకు నిరంకుశత్వము ప్రబలకుండ నిరోధించుటకును తోడ్పడుదురనియు ప్రజ లాశింతురు,
ఎంత జాగ్రత్తతో మెలగినను యంత్రయుగప్రభావముచేత మహానగరములలో కోట్లకొలది వస్తువుల నొక నమూనా మేరకు ఉత్పత్తిచేసికొనవలసిన దురదృష్టమును మహాయుద్ధముల విపత్తునకు సిద్ధమయియుండ వలసిన