పుట:Prabhutvamu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసననిర్వహణస్వరూపము

95

నని తోచినప్పుడు ప్రజలయభిప్రాయము తమకడ్డురాని ఆలోచనలన్నీ చేసి ప్రజలనోళ్లు మూయింప వచ్చును. రుష్యా యంతటి పూర్ణప్రజాప్రభుత్వాలు జర్మనీచీనాలు అయినా కాకపోయినా హిట్లరు షియాంగ్ కేషెక్కుల చరిత్రలు ఈవిషయములో నిదర్శనముగా తీసికొనవచ్చును.

హిట్లరు ప్రజనిర్వచితుడే. వర్సేయిల్సు సంధి కారణముగా జర్మనీపొందిన దురవస్థలను తుడిచివైచే పరమోత్సాహముచూపి పై కెగసినాడు. బీదల కార్థికస్వాతంత్ర్యములీయక పెట్టుబడిదారులు యూదులని బలవంతులపలుకుబడి నశింప జేయడానికి వారిని తరిమి కొట్టి, వారి జీవితములను హరించి ఆర్థికాధికారము తాను బాచుకొనినాడు. అధ్యక్షుడుగానున్న హిండెంబర్లు చనిపోతే ఆహో దానే రద్దుచేయించి ముఖ్యమంత్రియయిన తానే ఆయధికారమును వహించినాడు. మంత్రివర్గము లోని యితరులను నామకార్థముంచుకొని సర్వాధికారములు తానువహించినాడు. సర్వసైనికాధి కారము తనదే చేసుకొనినాడు. ఆస్ట్రియూసందర్భమున చేసినపని యాలోచింపుడు. షూస్నిగ్గు ప్రజలయభిప్రాయము తీసికొన నేర్పరచుచుండగా తాను సైన్యాలతో ప్రవేశించి దేశమాక్రమించి వోటింగు పెట్టించి అందరూ తానుచేసినపనిని అంగీకరించినారనినాడు. జర్మనుప్రజల ఏకీభావమును పెంపొందించి బలపరచే యుద్దేశముతో 'రీఖ్' అనే ఆదేశప్రభుత్వములో నిమిడ్చిన కొద్దిపాటి నిరంకుశత్వమును అందులో పరిపాలకవర్గాని కేర్పరచిన కొద్దిపాటి ప్రత్యేకత్వపుహక్కును ఇంతనిరంకు శత్వాన్ని తానుపెంచుకోడాని కతడు వినియోగించుకొని