94
ప్రభుత్వము
విషయాలనుబట్టి నిజమునకు శాసననిర్మాణమనేపేరుతో చేసే శాసననిర్మాణముకొద్ది శాసననిర్వాకులని మనము వ్యవహరించే దేశపరిపాలకులుచేసే శాసననిర్మాణము చాలయెక్కువ అనడముస్పష్టము, అది కారణముగానే బహుళసంఖ్యాకులయిన ప్రజల ప్రతినిధులచేతులలోనే పరిపాలన ఉండవలెననీ దూరమెక్కువయైనలదీ అట్టిప్రతినిధులకుకూడ జవాబుదారీతగ్గి నిరంకుశత్వం పెరగడానికి అవకాశమున్నది. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువగా పరిపాలన కార్యములను స్థానిక సంస్థల చేతులలోనే పెట్టవలసినదనీ, విధిలేని సమిష్టికార్యములకు విస్తారతరసంస్థలనుఉపయోగించు కొనవలసినదనీ లోకమంతటను అభిప్రాయము ప్రబలినది. రుష్యాచరిత్రకు మహాప్రాముఖ్యము కలగడానికి అచ్చటి సర్వరాజ్యసౌధాని కీ సోవియెట్టు– అనగా మనపంచాయతివంటి గ్రామసంస్థ - బునాదిగా ఏర్పడడమే. పరిపాలకులు నిరంకుశులు కాకుండా ఉండడానికి రుష్యాలో ఇతరోపాయములుకూడ అవలంబించినారు. కార్మికుల కర్షకులసంఘాలు ఎప్పటివలెనే పనిచేసికొనడానికి వాక్స్వాతంత్ర్య రచనాస్వాతంత్ర్యములనిచ్చి నిలిపినారు. ధనవంతులు, పెట్టుబడిదారులు పూర్తిగా అదృశ్యులై రాజ్యము కార్మికులదీ కర్షకులదీ యైనప్పటికీ ప్రభుత్వము నడిపేవారు తమతోకొద్దిగా భేదపడేవారున్నా వారిప్రచారాలను అరికట్టి తమప్రచారాన్ని సాగించుకొని ఎదుటిముఠాలనణచిపెట్టి తమముఠాలను బలపరచుకొని నిరంకుశులయ్యే ప్రయత్నముచేయ వచ్చును. తాత్కాలికముగానై నా మహాజనము తమకు వ్యతిరేకులు కావచ్చు