పుట:Prabhutvamu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసననిర్వహణస్వరూపము

93

బోర్డుకు గవర్నరుజనరలే నియమించును. ఎనమండ్రైరి. రిజస్టరులకాని మెంబరుల వర్గాలవారు ఎనిమిదిమంది డైరెక్టరులను ఎన్నుకొందురు. వారిలో ఒక్కరు గవర్నమెంటుపక్షమైనా గవర్నమెంటు మాట మెజారిటీతో నెగ్గును. లేదా కాస్టింగువోటుతో నెగ్గును. ఇక ఈ శాసనమును ఇండియాశాసనసభ వారు చేసినా దీనిని సవరించవలెనని నను, మార్చవలెననినను గవర్నరు జనరలుగారి యనుమతి మొదటనే పొందవలెను. రిజర్వుబ్యాంకును ఏకారణము చేతనై నను రద్దుచేయదలచినను అతడే చేయవలెను. దానికి ప్రత్యామ్నాయ మేమియను నిర్ణయముకూడ అతనిదే. ఇండియాశాసనసభవారు చేసిన శాసనానికి ఇన్ని దిగ్బంధనములుచేసి వారికి దానిమీద మరల అధికారములేకుండ చేయుటకు గవర్నమెంటు అఫ్ ఇండియా ఆక్టు ఉపయోగపరచికొనినారు,

శాసననిర్మాణవిషయము లట్లుండగా పరిపాలనవిషయములో ఇన్ని మినహాయింపులు, ఇన్ని ప్రత్యేకాధికారములు, ఇందరుప్రత్యేకాధికారులను కల్పించి సంస్థానముల సంగతిలో ఇండియానేలే ప్రతినిధులనుపంపే అధికారము వారికిచ్చి వారివ్యవహారాలలో గవర్నరుజనరలుకుకూడ అధికారాలీయక రాజప్రతినిధియనుపేరితో అతనికి వారితో సంబంధముకల్పించిన ఈ ఇండియా ప్రభుత్వవిధానమును ( ఫెడరేషనును) మొదలంట కాంగ్రెసువారు ప్రతిఘటించుచున్నారనిన అందులో వింతయేమియులేదు. శాసనాధికార పరిపాలనాధికారములు రెండును ప్రజలకు సంక్రమించిననే స్వరాజ్యమున కర్థముకలదు. పైనజెప్పిన అన్ని