Jump to content

పుట:Prabhutvamu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

ప్రభుత్వము

నిలిపిన విషయములలో రైల్వేలకు ప్రత్యేకము రైల్వే అధారటీ అని శాసనబద్ధసంస్థను నియమించి నారు. రైల్వేలకు సంబంధించిన సర్వకార్యనిర్వహణాధికారము ఫెడరలు రైల్వేఅథారటీది. దీని అధ్యక్షుని గవర్నరుజునరలు నియమించును. ఏడింట మూడువంతులకు తక్కువ గాక సభ్యులను అతడే నియమించును అని శాసనములో నున్నది. ఈషెడ్యూలులో ఇందులో సభ్యు లేడ్గురుందురు. ఏడ్గురను గవర్నరుజనరలు నియమించును అని యున్నది. షెడ్యూలుమార్చవలసి యున్నను గవర్నరుజనరలు ఒప్పుకొనిన పిదప శాసనసభలలో బిల్లుతేవచ్చును. మంత్రిగా ఏర్పడేవాడు రైల్వే అధారటీకి కార్యనీతి సలహాచేయవచ్చును. అక్కడను తగవుకలిగితే గవర్నరుజనరలుది తీర్మానము. ఈ విషయమై యిక వ్రాయనేల! రైల్వేల విషయములోవలే ఆర్థికవిషయములలోను ప్రత్యేకాధి కారములతో రిజర్వుబ్యాంకు అఫ్ ఇండియాను ఏర్పరచినారు. దీనికి సంబంధించిన చట్టమును 1935 వ సంవత్సరపు గవర్నమెంటు అఫ్ ఇండియా ఆక్టుకు ముందే 1934 లో ఇండియాశాసనసభలలోనే అంగీకరింపించినారు. దానిమేరకు ఇండియా నాణ్యెములు, మన ద్రవ్యమునకు ఇతర దేశముల ద్రవ్యములతోగల సంబంధము మొదలగు విషయముల పరిపాలనయంతయు రిజర్వుబ్యాంకుకు చెందిపోయినది. ఈరిజర్వుబ్యాంకి గవర్నరును ఇద్దరు డిప్టీ గవర్నరులను ఇండియాగవర్నరుజనరలు నియమించును, నలుగురు డైరెక్టరులను అతడు నియమించును. ఒక్క గవర్నమెంటు ఆఫీసరునుకూడ రిజర్వుబ్యాంకి