శాసననిర్వహణస్వరూపము
91
నారు. కాని బ్రిటిషువారు చేసిన చట్టములో అదిలేదు. అనుదినచర్యలో ఐ.సి.ఎస్ లతో సహా మంత్రులమాట జవదాటనట్లు కనిపించినా శాసనము ప్రకారము వీరు తమకు లోబడినవారు కాదు. కాబట్టి మంత్రులుకూడ తగిన జాగ్రత్తతోనే మెలగుచున్నారనుకొనదగును.
కోస్తాప్రభుత్వాలలో ఈతీరుగానుండ ఇండియా ప్రభుత్వము విషయములో బ్రిటిషు ప్రభుత్వమువారు అసలు శాసనసభలలోనే ఎన్నికలతో సంబంధము లేకుండ శిష్టసభ మొత్తము 260 గురలో 104 గురను, అసెంబ్లీ మొత్తము 275 గురలో 125 గురను స్వదేశసంస్థానాధిపతులు ప్రతినిధులను నియమించునట్లు విధించినారు. శిష్టసభలో 65 దింటిని, అసెంబ్లీలో 164 టిని ప్రత్యేక స్థానములుగా నియమించి కాంగ్రెసువంటి బలవత్తమ ప్రజాపార్టీ ఎక్కువరాకుండ జూచుకొన ప్రయత్నించినారు. ఎన్నికలుపెట్టే స్థలములకు అప్రత్యక్షపు టెన్నికలు నియమించి కోస్తాల శాసనసభ్యులే వోటరులుగానుండు నట్లేర్పరచినారు. ఇన్ని కోస్తాలలో కాంగ్రెసువారింత ఉద్దండముగా జయించెదరని వారనుకొనలేదని తోచును. కాని కాంగ్రెసువారు గెలిచినారు. గవర్నరుజనరలుకు ఎనిమిది ప్రత్యేకాధికారాలిచ్చుటేగాక దేశసంరక్షణ, విదేశములతోటి సంబంధము, ఇంగ్లీషు మత విచారము వీటిని శాసనసభల జోలినుండి తొలగించినారు. దేశసంరక్షణ అంటే అందులో భూసైన్యములు, నావికాసైన్యములు, విమానసైన్యము, తత్సంబంధపరిశ్రమలు అన్నియు చేరిపోయినవి. పదుగురు మంత్రుల కవకాశముచేసి వారికి