పుట:Prabhutvamu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

ప్రభుత్వము

ముఖ్యమంత్రిగా నియమించుకొనవలెను. రాజ్యములోని యుత్తమాధికారియగు రాజున కింతకంటె నెక్కువ యధికారములేదు. ముఖ్యమంత్రి యేర్పడినతోడనే అతడు తనతో నుండి పనిచేయదగిన మంత్రు లెవ్వరో వారిని తన కక్షిలోనుండి నియమించుకొనుచున్నాడు. ఈమంత్రులే ముఖ్యమంత్రితో గూడ మంత్రివర్గ మగుచున్నారు. వీరు ఎల్లరును ప్రజాప్రతినిధులు. ప్రజలకు నేరుగా జవాబుదారి కలవారు. ఎప్పుడు ప్రజలకు వీరియెడల విశ్వాసము లేదో అప్పుడే వీరు రాజీనామా యియ్యవలసిన వారు. అందుచేత ఆంగ్లభూమిలోని సర్వాధికారమును వీరియందు కేంద్రీకృతమగుచున్నది. ప్రజలలోని ఎక్కువ సంఖ్యాకుల యనురాగము వీరిపక్షమున నున్నంతకాలము వీరే ప్రజాప్రతినిధి సభకు నాయకులు. అందుచేత శాసనములు ప్రవేశ పెట్టుట, శాసనములను విమర్శించుట, శాసనములను నిరోధించుట ఎల్లశక్తులును వీరియందు నిక్షిప్తములయి యున్నవి. ఇంతియగాక ఈమంత్రివర్గమునందలి యొక్కొక్కరును ప్రభుత్వశాఖ యొక్కొక్కింటికి సధ్యక్షులుగా నేర్పడుచున్నారు. కాబట్టి ఆంగ్లభూమిలో ప్రజల యనురాగమును పెట్టుకొనిన యంతకాలము మంత్రివర్గము శాసన నిర్మాణనిర్వహణముల రెంటను నుత్తమాధికారి.

ఆంగ్ల \భూమిలో బహుకాలముగా రెండుకక్ష లే ఏర్పడి యున్నవి. ఇప్పుడు బలవంతమగు మూడవకక్షియు నేర్పడినది. ఈకక్షులలో స్వల్ప భేదములును నున్నవి. కాని విశేషభేదములు చాలకాలముగా గాని, చాలయెక్కువగా