74
ప్రభుత్వము
కారకాలము నాల్గుసంవత్సరములకు తక్కువగాక ఏడుసంవత్సరములకు నెక్కువగాక కాన్పించు చున్నది. ఇందులకు కారణము సులభముగా నూహ్యము. అధికారకాలపరిమితి మిక్కిలి తక్కువగా నున్న దనుకొందము. ఒక్కసంవత్సరమే యని తీసికొందము, అప్పు డథికారమున నుండు నాత డేమిచేయగలడో యాలోచింపుడు. చుయ్యిమని పెనముమీద అట్లుపోసినట్లుగా రాచకార్యములు చేయుటకు రాదు. కొంతవ్యవధియుండిననే గాని యుపక్రమితమయిన కార్యమును ఫలోన్ముఖము చేయుటకురాదు. సంవత్సరములోపుగా ఫలోన్ముఖత్వమును చూపుమనిన నేయధ్యక్షుడును చూపగలవాడుకాడు. మరి, సంవత్సరకాలమే యధికారకాలమందు రేని ఆయధికారికి కార్యములపట్ల, యభిప్రాయములపట్ల దార్ఢ్యముగూడ శూన్యమే యగును. ఈ నాడుండి రేపు పని వదలిపోవువార మేగదా మనకేల యీగొడవ, ప్రజలలోని మూక మనల మననీయదు, “ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కామాట లాడి యన్యులమనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ !" యను వెఱ్ఱి వేదాంతములకు దిగవచ్చును. ఇక నధికారపరిమితి చాల యెక్కువాయెనా-పదేండ్లు ఇరువదేండ్లయి శాశ్వతత్వమువంకకుములునూపెనా— వచ్చినదే లాభము, చే జిక్కినదే ఫలము, అధికారమున్నంత దనుక ననుభవింతము అను దురాశ జనించి దానిపనిని అదిచేసికొన వచ్చును. ఈ యెల్ల సందర్భము లాలోచించియే నాగరకరాష్ట్రములు అధికారము నిడుపునుగాక, కుఱుచయును గాక యుండు